iDreamPost

నటిగా నా కెరీర్ ప్రారంభానికి ముందు టాయిలెట్లు కడిగాను: స్టార్ హీరోయిన్

నటిగా నా కెరీర్ ప్రారంభానికి ముందు టాయిలెట్లు కడిగాను: స్టార్ హీరోయిన్

సినిమా రంగంలో నిలదొక్కుకోవాలంటే టాలెంట్ తో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. అలా అయితేనే స్టార్లుగా ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేస్తారు. అయితే తెరముందు ఎంత గొప్ప స్టార్ అయినా తెర వెనకాల మాత్రం వారి జీవితాల్లో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. ఈ క్రమంలో పలువురు నటీ నటులు తమ గోడును వెలిబుచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఓ స్టార్ హీరోయిన్ తన నటజీవితానికి ముందు పడ్డ ఇబ్బందులను మీడియాకు వెల్లడించింది. ఒకానొక సందర్బంలో టాయిలెట్లు క్లీన్ చేశానని తెలిపింది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవల రెండో వివాహంతో వార్తల్లో నిలిచిన పాకిస్తాన్ స్టార్ హీరోయిన్ మహీరా ఖాన్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింటా వైరల్ గా మారింది. దీనికి గల కారణం ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలే. మహీరా ఖాన్ మాట్లాడుతూ.. నటిగా నా కెరీర్ ప్రారంభానికి ముందు 17ఏళ్ల వయసులో చదువు కోసం యూఎస్ వెళ్లాను అని తెలిపింది. ఆ సమయంలో ఖర్చుల కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది.

దీంతో చేసేదేం లేక ఫ్లోర్లు తుడవడం, టాయిలెట్లు కడగడం వంటి పనులు చేశాను అని ఆమె చెప్పింది. గతంలో ఓ ఇంటర్య్వూలో చెప్పిన విషయం ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. కాగా మహిరా ఖాన్ షారుఖ్ ఖాన్ సరసన ‘రయీస్’లో నటించి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. భారతదేశంలో తనకంటూ భారీ అభిమానులను సంపాదించుకుంది. 38 ఏళ్ల మహీరా ఇటీవల వ్యాపారవేత్త సలీమ్ కరీమ్‌తో రెండవ వివాహం చేసుకోవడంతో వార్తల్లో నిలిచింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి