బిగ్‌బాస్‌లో ‘కొప్పుల’ యుద్ధం నడుస్తోంది. లాస్య మంజునాథ్‌కీ, దేవీ నాగవల్లికీ మధ్య ఎక్కడో ఇగో క్లాషెస్ స్టార్ట్ అయ్యాయి. కిచెన్ వ్యవహారాలు తనకు అప్పగించాల్సిందిగా దేవి నాగవల్లి కోరితే, కెప్టెన్ లాస్య అందుకు ఒప్పుకోలేదు. స్టోర్ మేనేజర్‌ని ఎంపిక చేయాల్సి వచ్చినప్పుడూ దేవి నాగవల్లి రిక్వెస్ట్‌ని చాలా తేలిగ్గా తిరస్కరించేసింది లాస్య. పైగా, ‘ఎవరైతే కిచెన్ వ్యవహారాలు చూసుకుంటారో, వారికే స్టోర్ మేనేజర్ బాధ్యతలు ఇస్తే బావుంటుంది..’ అని ఓ లాజిక్ లాగింది లాస్య. అదేంటీ, అలాగైతే నేనే ముందు కిచెన్ గురించి అడిగాను కదా.? అప్పుడు ఇవ్వకుండా, ఇప్పుడు ఈ లాజిక్ తీయడమేంటి? అంటూ దేవి ఒకింత అసహనం వ్యక్తం చేసింది లాస్య మీద. అయితే, లాస్య.. సరైన సమాధానమివ్వకుండానే అమ్మ రాజశేఖర్‌ని స్టోర్ మేనేజర్‌గా ఎంపిక చేసింది. దీనిపై మిగతా సభ్యులంతా హర్షం వ్యక్తం చేసినా దేవి మాత్రం మౌనంగా వుండిపోయింది. కింగ్ నాగార్జున, పదే పదే దేవి నాగవల్లి గురించి గొప్పగా మాట్లాడుతుండడాన్ని బహుశా లాస్య జీర్ణించుకోలేకపోతోందేమోనన్నది దేవి అభిమానుల వాదన. ఈసారి బిగ్‌హౌస్‌లో టఫెస్ట్ కంటెస్టెంట్స్ లిస్ట్‌లో లాస్య కంటే చాలా చాలా ముందు విన్పిస్తోంది దేవి నాగవల్లి పేరు. అయితే, ఆమెకు సోషల్ మీడియాలో మరీ అంత ఎక్కువ ఫాలోయింగ్ లేదనుకోండి.. అది వేరే సంగతి. లాస్య అభిమానులు మాత్రం, దేవి ఓవరాక్షన్ చేస్తోందంటూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.