iDreamPost
android-app
ios-app

బోండా ఉమా, మరి మీ కబ్జాల సంగతేంటి?

  • Published Jan 03, 2020 | 2:27 AM Updated Updated Jan 03, 2020 | 2:27 AM
బోండా ఉమా, మరి మీ కబ్జాల సంగతేంటి?

నిన్న 02 -Jan-2020 సాయంత్రం టీడీపీ ఇంసైడర్ ట్రేడింగ్ పై వైసీపీ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీద టీడీపీ నాయకుడు బోండా ఉమా స్పందిస్తు హెరిటేజ్ సంస్థ రాజధాని సమీపంలో భూములు కొన్నది 2014 లనే కానీ ఆ సంస్థ భూములు కొనాలని “2013 లోనే అంతర్గత తీర్మానం” చేసిందని, అదెలా ఇంసైడర్ ట్రేడింగ్ అవుతుందని ప్రశ్నించారు .

అలాగే వైసీపీ నేతలు కూడా రాజధానిలో భూములు కొన్నారని వారు కొంటె సక్రమం మేము కొంటె అక్రమమా అని ప్రశ్నించారు. ఈ అంశం పై వైసీపీ ఆఫీస్ లోనే చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు .

రాజధాని భూముల మీద అధికార,ప్రతిపక్ష పార్టీల మధ్య సవాళ్లు,ప్రతిసవాళ్లు కొనసాగుతుండగా మరోవైపు బోండా ఉమా భూకబ్జాలు మీద చర్చ జరుగుతుంది.

గతంలో బోండా ఉమానే స్వయంగా పలు భూ కబ్జాలు , కుంభకోణాలు , దౌర్జన్యాలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు . కొన్ని వివాదాలు కోర్టుకి వెళ్లినవి కూడా ఉన్నాయి . 

స్వాతంత్ర్య సమర యోధులకు కేటాయించిన ఐదు ఎకరాల భూమిని ఇరువురు అనామకుల పేరు మీదకి మార్పించి వారితో బోండా ఉమ సతీమణి సుజాత , మరి కొందరి పేరుల మీద డెవలప్మెంట్ అగ్రిమెంట్ రాయించిన కేసు 2018 మొదటి నెలలో సంచలనం సృష్టించింది . తమ స్థలంలో బోండా ఉమా అనుచరులు ప్రహరీ నిర్మించడం పై ఫిర్యాదు చేసిన స్వాతంత్ర్య సమర యోధుని మనవడు సురేష్ ను ఏసీపీ స్థాయి అధికారి తీవ్రంగా బెదిరించాడని అప్పట్లో వార్తలొచ్చాయి . రూ 80 కోట్ల విలువైన ఈ భూవివాదం పై సీఐడీ దర్యాప్తులో పలు మోసాలు బయట పడ్డాయి . కాగా ఆంధ్రజ్యోతి కూడా తమ పరిశీలనలో పలుఅక్రమాలు బయటపడ్డట్టు వెల్లడించింది .

పెనమలూరు డెవలప్మెంట్ పేరుతో తమ 86 సెంట్ల భూమిని ఆక్రమించారని ఇదేమని ప్రశ్నిస్తే చంపేస్తామని బోండా ఉమా అనుచరులు బెదిరిస్తున్నారని ఉమాభవాని , లక్ష్మీదేవి అనే ఇద్దరు మహిళలు జాయింట్ కలెక్టర్ ని కలిసి వేడుకొన్న విషయం అప్పట్లో మరో సంచలనం అయ్యిందని చెప్పొచ్చు . డేవలప్మెంట్ పేరుతో భూమి తాకట్టు పెట్టి లోన్ తీసుకొని ఎం చేయకపోగా భూమి అప్పగించట్లేదని , బ్యాంక్ వాళ్ళు లోన్ తీర్చమని తమని వేధిస్తున్నారని అధికారులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారని పత్రికా ముఖంగా వాపోయారు .

Read Also: శెభాష్‌ ఆళ్ల… ఎందుకంటే..?

అలాగే మాదం శెట్టి సుమశ్రీ అనే మహిళకు ఉన్న కుటుంబ వివాదాలని ఆసరా చేసుకుని ఆమెకి చెందిన ఇంటిని బోండా ఉమా అనుచరులు ఆక్రమించగా కేన్సర్ తో బాధ పడుతున్న తన బిడ్డకి వైద్యం చేయించటానికి తన వద్ద డబ్బుల్లేవని ఆ ఇల్లు అమ్మితేనే వైద్యం చేయించగలనని తన ఇల్లు తనకిప్పించామని పలు చోట్ల మొరపెట్టుకొన్నా చివరికి ఆమె బిడ్డ 13 ఏళ్ల పసిపాప సాయిశ్రీ వైద్యం అందక చనిపోయినా కానీ ఆ ఇంటిని వదలని విషయం పై కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు చంద్రబాబుకి రిపోర్ట్ చేశాయని సమాచారం .

ఇవే కాక రాజరాజేశ్వరి పేటలో కొందరికి చెందిన రెండున్నర కోట్ల విలువైన 1700 గజాలు స్థలం ఆక్రమించి ప్రహరీ కట్టేసిన వైనం పై పోలీసులకు పిర్యాదు చేసినా ఫలితం లేకపోతే జాయింట్ కలెక్టర్ ని సైతం కలిసి మొర పెట్టుకున్న వైనం మీద
“బాబోయ్ బోండా భూముల దందా ” అంటూ అప్పట్లో పత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చింది .

Read Also: నేడే బీసీజీ నివేదిక..?

ఇహ బోండా సోదరుడైతే ఏకంగా విజయవాడ శివారులోని మున్సిపల్ కార్పోరేషన్ స్థలాన్ని కబ్జా చేసి ఫెన్సింగ్ వేసిన ఘనుడని పలు మాధ్యమాల్లో వార్తలొచ్చాయి . వీరు కాక బోండా అనుచరుల పై కూడా బర్మా కాలనీ , సింగ్ నగర్ , మరికొన్ని ప్రాంతాల్లో స్థలాలు , ప్లాట్స్ కబ్జాలు చేసినట్టు పలు ఆరోపణలు ఉన్నాయి .

ఈ విధంగా లెక్క లేనన్ని భూ కబ్జాలు ఆరోపణలు ఉన్న బోండా ఉమా గారు టీడీపీ నేతల రాజధాని ఇంసైడర్ ట్రేడింగ్ పై వైసీపీ తాడేపల్లి ఆఫీస్ లోనే బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ చేయటమ్ విశేషం .

Read Also: మూడు రాజధానుల పై బిజెపి నేతలకు కేంద్రమంత్రి క్లాస్

మరి వైసీపీ నేతలు సవాల్ ని స్వీకరిస్తే కేవలం అమరావతి పైనే చర్చిస్తారా , లేక బోండా అక్రమాలన్నింటి పై కూడా చర్చిద్దామని సవాల్ విసురుతారా ? . అలా విసిరితే బోండా ఆ సవాల్ స్వీకరించగలడా ?

ఎక్కడ టీడీపీ అవినీతి కనపడ్డా విచారించి బాధితులకు న్యాయం చేయమంటున్న వైసీపీ అధినేత జగన్ బోండా భూ దందాల పై కూడా విచారణకు ఆదేశించి ఉమాకి షాక్ ఇస్తాడా అనేది వేచి చూడాలి .