iDreamPost
android-app
ios-app

Laal Singh Chaddha చిరంజీవి అమీర్ ఖాన్ ఫ్రెండ్ షిప్ స్టోరీ

  • Published Jul 25, 2022 | 11:51 AM Updated Updated Jul 25, 2022 | 11:51 AM
Laal Singh Chaddha చిరంజీవి అమీర్ ఖాన్ ఫ్రెండ్ షిప్ స్టోరీ

నిన్న సాయంత్రం జరిగిన లాల్ సింగ్ చడ్డా ప్రెస్ మీట్ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగడమే కాదు అమీర్ ఖాన్, చిరంజీవి, నాగ చైతన్య అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. హిందీలో స్టార్ హీరో అయ్యుండి మీ బ్లెస్సింగ్స్, హెల్ప్ కోసం ఇంత దూరమొచ్చానని అమీర్ చిరుని ఉద్దేశించి చెప్పడం, ఇద్దరూ కూర్చున్న పొజిషన్ లోనే పరస్పరం కౌగిలించుకోవడం అందరినీ ఆకట్టుకుంది. దానికన్నా ముందు ఒకరికొకరు పానీపూరి తినిపించుకోవడం కూడా హైలైట్ అయ్యింది. వీళిద్దరి దెబ్బకు చైతు అలా చూస్తూ ఉండిపోవడం తప్ప ఏమి చేయలేకపోయాడు. మొదటిసారి చిరంజీవి ఒక బాలీవుడ్ మూవీని సమర్పించడంతో దాని మీద ఎక్కువ చర్చే జరిగింది.

ఈ క్రమంలోనే అమీర్ చిరుల స్నేహానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు బయటికి వచ్చాయి. 1993 ప్రాంతంలో బాజీ షూటింగ్ జరుగుతున్న టైంలో అమీర్ మెగాస్టార్ ని కలిశాడు. అప్పుడు మొదలయ్యింది పరిచయం, ఇద్దరూ రెగ్యులర్ గా కలుసుకోనప్పటికీ పలు సందర్భాల్లో ఒకరినొకరు పలకరించుకొనేవారు. బాలీవుడ్ మొదటి వంద కోట్ల సినిమా గజినీకి క్లాప్ కొట్టింది చిరంజీవే. ఆ తర్వాత సైరా టైంలో జపాన్ ఎయిర్ పోర్ట్ లో ఇద్దరూ ఎక్కువ సేపు గడపాల్సి వచ్చింది. ఆ సందర్భంలోనే లాల్ సింగ్ గురించి అమీర్ చెప్పడం, రిలీజ్ టైంలో మద్దతు కావాలని అడగటం, వెంటనే ఈయనా ఒప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. ఆ కథ ఇక్కడి దాకా వచ్చింది.

గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ కన్నా ముందు తననే అడిగితే చేసేవాడిని కదా అని అమీర్ ఖాన్ ఫోన్ లో చిరుని అడిగారట. అయితే ఆ పాత్రకు కండలు తిరిగిన శరీరం కావాలి కాబట్టి సల్లు భాయ్ తో వెళ్లానని క్లారిటీ ఇచ్చేశారు. ఇక అమీర్ ని సైతం మెగాస్టార్ పొగడ్తలతో ముంచెత్తారు. తాము ఎంత సేపూ ఫ్యాన్స్ ని అలరించే కమర్షియల్ సినిమాలే చేస్తామని, అమీర్ లాగా ప్రయోగాలు అందరి వల్ల కాదని దంగల్ ని ఉదహరిస్తూ చెప్పారు. ఒక సినిమా షూట్ కు ముందే అన్నేసి వర్క్ షాప్స్ నిర్వహించడం మనమూ నేర్చుకుంటే మంచి ఫలితాలు అందుకోవచ్చని అన్నారు. ఎమోషనల్ సాగే లాల్ సింగ్ గురించి ఇద్దరూ అంత ఎమోషన్ అవ్వడం విశేషం

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetgrandpashabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis giriş