iDreamPost
iDreamPost
Laal Singh Chaddha box office collection: అమీర్ ఖాన్-కరీనా కపూర్ ఖాన్ సినిమాకు కనీసం టిక్కెట్లు తెగకపోవడంతో ఓవర్ హెడ్ ఖర్చులను తగ్గించుకోవడానికి 1,300 షోలను ఎత్తేశారు. అక్షయ్ కుమార్ రక్షా బంధన్ పరిస్థితి మరీ దారుణం. ఈ రెండు సినిమాలను చూడటానికి ఆడియన్స్ రెడీగా లేరని ట్రేడ్ అంటోంది.
లాల్ సింగ్ చద్దా 2022లో వచ్చిన ప్రతిష్టాత్మకమైన సినిమాల్లో ఒకటి. ఫారెస్ట్ గంప్ అఫీషియల్ రీమేక్. నాలుగేళ్లపాటు అమీర్ ఖాన్, లాల్ సింగ్ చద్దా 180 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తీర్చిదిద్దారు. కోట్లుకన్నా, నాలుగేళ్ల సమయాన్ని అమీర్ ఖాన్ వెచ్చించడం ఇంకా పెద్దది. వారం రోజులుగా సోషల్ మీడియాలో చెలరేగి ట్రెండ్ అవుతున్న #BoycottBollywood దెబ్బకు లాల్ సింగ్ చాలా దారుణంగా దెబ్బతిన్నాడు. ఓపెన్సిగ్ లేవు. అడ్వాన్స్ బుకింగ్స్ లేవు. ఈ ఒక్క హ్యాష్ టాక్ దెబ్బకు 25 శాతం మేర కలెక్షన్స్ పడిపోయాయి. బాలీవుడ్ కు ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే, లాల్ సింగ్ చద్దా , రక్షా బంధన్ ను కలగిలిపినా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రూ. 20 కోట్ల కంటే తక్కువ. అటు అమీర్ ఖాన్, ఇటు అక్షయ్ కుమార్ ఇద్దరూ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్. వారంలోనే కలెక్షన్స్ ను వంద కోట్లను అవలీలగా దాటించగల స్టార్స్. అందులోనూ అమీర్ ఖాన్ సినిమా వచ్చి నాలుగేళ్లు అయ్యింది. అయినా ఇద్దరి సినిమాలు ఎందుకింత డిజాస్టర్లు? ఏం జరిగింది? ఆన్ లైన్ లో నెగిటీవిటీ సినిమాలను చంపేసిందా?
కలెక్షన్స్ లేవు. 500 సీటింగ్ ఉన్నచోట కనీసం 50 టిక్కెట్లు కూడా తెగడంలేదు. థియేటర్ల దగ్గర అసలు హంగామాయే లేదు. అందుకే లాల్ సింగ్ చద్దా , రక్షా బంధన్ షోలను తగ్గించాలని సినిమా హాల్ యజమానులు స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నారు. ఈ రెండు సినిమాలకు ఇండియా మొత్తంమీద 10,000 షోలు అందుబాటులో ఉన్నా, ఓపెనింగ్ షోకు పట్టుమని పాతికమందికూడాలేరు. 10-15 మంది మాత్రమే వస్తే థియేటర్లను రన్ చేసేది ఎలాగ? కనీసం కరెంట్ ఖర్చులుకూడా రానప్పుడు ఎలా షోలను ప్రదర్శించేది? అందుకే ఎగ్జిబిటర్లు ఓవర్‌హెడ్‌లను ఆదా చేయడానికి , ఆక్యుపెన్సీని పెంచడానికి రెండవ రోజు రెండు సినిమా షోలను తగ్గించారు. అంటే నాలుగు షోలు పడాల్సిన చోటు రెండు-మూడు షోలను మాత్రమే వేస్తున్నారు. అంటే ఇద్దరి సూపర్ స్టార్లకే కాదు, మొత్తం బాలీవుడ్ కే అవమానం. చిరంజీవి లాంటి స్టార్లు ప్రమోట్ చేసినా తెలుగునాట కనీసం కలెక్షన్స్ లేవు. అమీర్ ఖాన్ సినిమాకు ఏం జరిగింది?
ఒక్క లాల్ సింగ్ చద్దా షోల్లో 1,300 షోలను తెగ్గోశారు. రక్షా బంధన్ 1000 షోలను తగ్గించింది. ఆర్ఆర్ఆర్ ను చూసి వాతలుపెట్టుకున్నట్లు, సినిమాలను ఈ రేంజ్ లో భారీగా విడుదల చేయడం తప్పుడు నిర్ణయమని బాలీవుడ్ అంచనావేస్తోంది. మల్టీప్లెక్స్‌లలో రక్షా బంధన్ డిజాస్టర్. ఇక మాస్ ఏరియాల్లో లాల్ చంద్ ఫ్లాప్ అయ్యాడు. ఉన్న షోలను తగ్గించినా రెండోరోజుకూడా పది టిక్కెట్లు కూడా తెగకపోవడంతో చాలా షోలు రద్దయ్యాయి. బాలీవుడ్ కు వినాశనమేనా?