Uppula Naresh
ప్రతి ఆడ పిల్ల.. ఇంకో బిడ్డకు తల్లి కావాలని ఆశపడుతుంది. మాతృత్వం కోసం ఆరాటపడుతుంది. పసిపిల్లల ముసి ముసి నవ్వుల కోసం తొమ్మిది నెలల భారాన్ని.. చిరునవ్వుతో మోస్తుంది. ఆ మహిళ కూడా అలానే ఆశించింది. కానీ ఊహించని విధంగా..
ప్రతి ఆడ పిల్ల.. ఇంకో బిడ్డకు తల్లి కావాలని ఆశపడుతుంది. మాతృత్వం కోసం ఆరాటపడుతుంది. పసిపిల్లల ముసి ముసి నవ్వుల కోసం తొమ్మిది నెలల భారాన్ని.. చిరునవ్వుతో మోస్తుంది. ఆ మహిళ కూడా అలానే ఆశించింది. కానీ ఊహించని విధంగా..
Uppula Naresh
కొమరం భీమ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ మూడు నెలల గర్భిణి నడి రోడ్డుపై మృతి చెందింది. వెంటనే స్పందించిన కొందరు వాహనదారులు స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకుని ఆమె భర్త, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇంతకు ఆ మహిళ ఎలా చనిపోయింది? ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. కొమరం భీమ్ జిల్లా కాగజ్ నగర్ మండలం అందవెల్లి గ్రామానికి చెందిన అంగల మల్లేష్ కు చింతగూడ గ్రామానికి చెందిన శిరీషతో 5 నెలల కిందట వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు ఎంతో సంతోషంగా ఉండేవారు. ఈ వివాహిత ప్రస్తుతం 5 నెలల గర్భివతి కావడంతో ఇటీవల పుట్టింటికి వెళ్లింది. అయితే తాజాగా వీరి కుటుంబ సభ్యుల శుభకార్యం ఉండడంతో అందరితో కలిసి ఆటోలో బయలు దేరారు. సిర్పూర్ మండలం పారిగాం వద్ద వీరి ప్రయాణిస్తున్న ఆటో ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా, శిరీష గా తీవ్రంగా గాయపడింది. వెంటనే స్పందించిన వాహనదారులు గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ శిరీష తాజాగా ప్రాణాలు కోల్పోయిది. ఈ విషయం తెలుసుకుని మృతురాలి భర్త, తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఈ ఘటనపై శిరీష భర్త స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నా భార్య మరణానికి ఆటో డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.