iDreamPost
android-app
ios-app

నార్సింగ్‌ ORR ఇంటర్‌ చేంజ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌!

  • Published Jul 01, 2023 | 2:25 PMUpdated Jul 01, 2023 | 2:25 PM
  • Published Jul 01, 2023 | 2:25 PMUpdated Jul 01, 2023 | 2:25 PM
నార్సింగ్‌ ORR ఇంటర్‌ చేంజ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌!

హైదరాబాద్‌ నార్సింగి దగ్గర ఓఆర్‌ఆర్‌పై నిర్మించిన ఇంటర్‌ చేంజ్‌ను ప్రారంభించారు మంత్రి కేటీఆర్‌. ఈ కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘దేశంలో ఏ నగరానికి లేని ప్రత్యేకత మన భాగ్యనగరం.. హైదరాబాద్‌కు ఉంది. అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. ప్రజలకు మేరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. దీనిలో భాగాంగానే నార్సింగి దగ్గర రూ.29.50 కోట్లతో ఇంటర్‌ చేంజ్‌ నిర్మించాము. ఓఆర్‌ఆర్‌పై నిర్మించిన ఇంటర్‌ చేంజ్‌లలో ఇది 20వది. త్వరలో మరొకటి అందుబాటులోకి వస్తుంది’’ అని తెలిపారు.

అలానే ‘‘ఔటర్‌ రింగ్‌ రోడ్‌పై స్పీడ్‌ లిమిట్‌ను 120 కిలోమీటర్లకు పెంచాము. మూసీ నదిపై 14 బ్రిడ్జిల నిర్మాణాలకు అనుమతులిచ్చాము. త్వరలోనే వాటికి శంకుస్థాపన చేస్తాం. ఐదు టెండర్ల దశలో ఉన్నాయి. దీనిలో భాగంగా శంషాబాద్‌ నుంచి నాగోల్‌ వరకు 55 కిలోమీటర్ల మేర మూసీపై ఎక్స్ ప్రెస్‌ వే నిర్మిస్తాం. దానికి రూ.15 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచాన వేస్తున్నాం అని తెలిపారు’’ మంత్రి కేటీఆర్‌.

గ్రేటర్‌ చుట్టూ ఉన్న 158 కి.మీ వరకు  ఔటర్‌ రింగు రోడ్డుపై ఇప్పటి వరకు 19 ఇంటర్‌ చేంజ్‌లు ఉన్నాయి. ఇవే కాక హెచ్‌ఎండీఏ.. నార్సింగి, కోకాపేట నియోపొలీస్‌, మల్లంపేట ప్రాంతాల్లో కొత్తగా మరో మూడు ఇంటర్‌ చేంజ్‌ల నిర్మాణాన్ని చేపట్టింది. ఇందులో నార్సింగి ఇంటర్‌ చేంజ్‌ పనులు పూర్తి కావడంతో శనివారం మంత్రి కేటీఆర్‌ దాన్ని ప్రారంభించారు. త్వరలోనే దీనిపై ట్రాఫిక్‌ను అనుమతించనున్నారు అధికారులు.

నార్సింగి ఇంటర్‌ చేంజ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం మంత్రి కేటీఆర్‌.. కోకాపేటలో మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ను ప్రారంభించారు. మురుగునీటి శుద్ధి కోసం దాదాపు రూ.3,866 ఖర్చుతో కొత్తగా 31 మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ల (ఎస్టీపీ) నిర్మాణానికి శ్రీకారం చుట్టామని.. అందులో మొదటిది ఇవాళ కోకాపేటలో ప్రారంభించినట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అంతేకాదు.. సెప్టెంబర్‌ నాటికి దశలవారిగా దేశంలోనే 100 శాతం మురుగునీటిని శుద్ధిచేస్తున్న తొలి నగరంగా హైదరాబాద్‌ చరిత్ర సృష్టించనుందని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి