iDreamPost
షూటింగ్ పూర్తయినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ లో ఆలస్యంతో పాటు రిలీజ్ డేట్ కు సంబంధించి సరైన స్లాట్ సెట్ కాకపోవడంతో అభిమానులకు ఎదురు చూపులు తప్పడం లేదు.
షూటింగ్ పూర్తయినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ లో ఆలస్యంతో పాటు రిలీజ్ డేట్ కు సంబంధించి సరైన స్లాట్ సెట్ కాకపోవడంతో అభిమానులకు ఎదురు చూపులు తప్పడం లేదు.
iDreamPost
ఒకప్పుడు గులాబీ, నిన్నే పెళ్లాడతా లాంటి క్లాసిక్స్, బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు కృష్ణవంశీ కొత్త సినిమా రంగమార్తాండ విడుదల కోసం ఆపసోపాలు పడుతూనే ఉంది. షూటింగ్ పూర్తయినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ లో ఆలస్యంతో పాటు రిలీజ్ డేట్ కు సంబంధించి సరైన స్లాట్ సెట్ కాకపోవడంతో అభిమానులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ప్రకాష్ రాజ్ టైటిల్ పాత్ర పోషించిన ఈ మూవీలో మంచి క్యాస్టింగ్ ఉంది. అనసూయ, బ్రహ్మానందం తదితరులతో పెద్ద తారాగణమే సెట్ చేశారు. ముఖ్యంగా ఇళయరాజా సంగీతం మీద భారీ అంచనాలున్నాయి. అంతఃపురం తర్వాత రిపీట్ అవుతున్న కాంబో కావడంతో మ్యూజిక్ లవర్స్ చాలా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.
ఈ రంగమార్తాండ మరాఠి బ్లాక్ బస్టర్ నటసామ్రాట్ రీమేక్. నానా పాటేకర్ నటించిన ఈ సెంటిమెంట్ కం ఎమోషనల్ డ్రామా ఒరిజినల్ వెర్షన్ కు చాలా పేరొచ్చింది. కమర్షియల్ గానూ బాగా ఆడింది. నటనే ప్రాణంగా బ్రతికే ఓ రంగస్థల నటుడి జీవితాన్ని హృద్యంగా ఇందులో చిత్రీకరించారు. కాకపోతే కమర్షియల్ అప్పీల్ తక్కువగా ఉన్న కారణంగా దీని మీద రీమేక్స్ కు అంత క్రేజ్ రాలేదు. అయినా కృష్ణవంశీ రిస్క్ కు సిద్ధపడ్డారు. కాకపోతే మూడేళ్ళ క్రితం మొదలుపెడితే రకరకాల కారణాల వల్ల ఆగుతూ సాగుతూ ఫైనల్ గా ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది. ఇంకా లిరికల్ వీడియోలు కానీ టీజర్లు కానీ ఏవి వదల్లేదు. త్వరలోనే వీటికి మోక్షం కలిగించబోతున్నారు.
తాజాగా అందిన సమాచారం మేరకు రంగమార్తాండని దీపావళికి రెడీ చేయబోతున్నారు. ప్రస్తుతానికి ఆ టైంకి పెద్ద పోటీ అంటూ ఏది లేదు. ఇలాంటి వాటికి ఓపెనింగ్స్ రావు. అందులోనూ హీరో సపోర్ట్ లేకుండా. అలాంటప్పుడు సోలో రావడం సేఫ్ అవుతుంది. పైగా బిజినెస్ కూడా అంత ఈజీగా తేలదు. బయ్యర్లు రిస్క్ గా ఫీలవుతారు. వాళ్ళను సంతృప్తి పరుస్తూ పబ్లిక్ ని సినిమా చూసేలా మంచి ప్రమోషన్లు చేసుకోవాలి. ఇప్పటిదాకా కృష్ణవంశీ సోషల్ మీడియా సహాయంతో ఎంతో కొంత బజ్ తీసుకొస్తున్నారు కానీ అసలైన పబ్లిసిటీ వీలైనంత త్వరగా మొదలుపెట్టాలి. ఇది హిట్ అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్ అన్నంతో పాటు వెబ్ సిరీస్ పనులు వేగంగా ముందుకు కదులుతాయి