Kondapolam : బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ – బుల్లితెరపై సూపర్ హిట్

ఉప్పెనతో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న వైష్ణవ్ తేజ్ రెండో సినిమా కొండపొలం బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిలైన సంగతి తెలిసిందే. క్రిటిక్స్ ప్రశంసలు దక్కినా ప్రేక్షకుల నుంచి కాసులు రాలేదు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన నవల ఆధారంగా రూపొందిన ఈ ఫారెస్ట్ థ్రిల్లర్ లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ కాగా కోట, సాయిచంద్ లాంటి సీనియర్ క్యాస్టింగ్ చాలానే ఉంది. పవన్ కళ్యాణ్ తో హరిహరవీరమల్లు చేస్తున్న దర్శకుడు క్రిష్ దానికి కొంత గ్యాప్ రావడంతో ఆ టైంలో కొండపొలం పూర్తి చేశారు. తక్కువ బడ్జెట్ లో అయినా కూడా క్వాలిటీ అవుట్ ఫుట్ తో కరెక్ట్ టైంకే థియేటర్లకు తీసుకొచ్చారు కానీ ఫలితం దక్కలేదు.

ఇటీవలే ఈ సినిమా శాటిలైట్ ప్రీమియర్ జరుపుకుంది. ఊహించని విధంగా 12.34 అర్బన్ టిఆర్పి రేటింగ్ సాధించడం విశేషం. రూరల్ ని కలుపుకుంటే 10.54 దాకా వస్తుంది. ఎలా చూసుకున్నా ఇది భారీ స్పందనే. ఎందుకంటే గత ఏడాది టాప్ బ్లాక్ బస్టర్స్ కు దగ్గరగా ఈ కొండపొలం నిలవడం విశేషం. గతంలో బ్లాక్ బస్టర్ జాతిరత్నాలుకు దీనికన్నా తక్కువగా 10.2 రావడం గమనించాల్సిన అంశం. సీరియస్ గా సాగే కొండపొలంని హోమ్ ఆడియన్స్ ఎంత మేరకు ఆదరిస్తారనే అనుమానాలు పూర్తిగా తొలగిస్తూ మొత్తానికి అక్కడ గట్టిగా ఆడేసింది. ఓటిటి రిలీజైన టక్ జగదీష్ స్టార్ మాలో మొదటిసారి వచ్చినప్పుడు ఇంతకన్నా తక్కువ తెచ్చుకోవడం ట్విస్టు.

దీన్ని బట్టి ఒకటి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కొన్ని సినిమాలు థియేటర్లో ఆదరణ పొందనంత మాత్రాన అవి బాలేదనే నిర్ణయానికి రాలేం. ఒకవేళ నిజంగానే విషయం లేకపోతే టీవీలో వచ్చినా తిరస్కారం తప్పదు. గతంలో చాలా సినిమాలు ఈ సత్యాన్ని ఋజువు చేశాయి. ఎంటర్ టైన్మెంట్ ని ఎక్కువగా ఇష్టపడే ఛానల్ ప్రేక్షకులు కొండపొలంని దగ్గరకు తీసుకున్నారు. థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ని అన్ని సినిమాలకు దక్కాలని నిర్మాతలు అనుకున్నప్పటికీ కొన్నిసార్లు ఇలాంటి ఫలితాలు చూసినప్పుడు డిజిటల్ ఆప్షన్ ఎంత మెరుగ్గా ఉంటుందో అర్థమవుతుంది. మొత్తానికి వైష్ణవ్ తేజ్ పెద్దతెర మీద కాకపోయినా బుల్లితెరపై హిట్టు కొట్టాడు

 Tollywood Sankranthi : సంక్రాంతి ఎంటర్ టైన్మెంట్ ఇన్ని కోట్లేనా

Show comments