iDreamPost
android-app
ios-app

రీతూ వర్మతో లవ్‌ పుకార్లు.. వైష్ణవ్‌ తేజ్‌ ఏమన్నాడంటే..

  • Published Nov 19, 2023 | 2:45 PM Updated Updated Nov 19, 2023 | 2:45 PM

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌- హీరోయిన్‌ లావణ్య త్రిపాఠిల పెళ్లిలో హీరోయిన్‌ రీతూ వర్మ సందడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో కొన్ని పుకార్లు షికార్లు చేయటం మొదలైంది. ఆ పుకార్లపై వైష్ణవ్‌ తేజ్‌ క్లారిటీ ఇచ్చారు.

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌- హీరోయిన్‌ లావణ్య త్రిపాఠిల పెళ్లిలో హీరోయిన్‌ రీతూ వర్మ సందడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో కొన్ని పుకార్లు షికార్లు చేయటం మొదలైంది. ఆ పుకార్లపై వైష్ణవ్‌ తేజ్‌ క్లారిటీ ఇచ్చారు.

  • Published Nov 19, 2023 | 2:45 PMUpdated Nov 19, 2023 | 2:45 PM
రీతూ వర్మతో లవ్‌ పుకార్లు.. వైష్ణవ్‌ తేజ్‌ ఏమన్నాడంటే..

మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌.. మామ పవర్‌ స్టార్‌ సినిమాతోనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 2003లో వచ్చిన ‘జానీ’ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ చిన్నప్పటి పాత్ర పోషించారు. తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి సూపర్‌ హిట్‌ సినిమా ‘శంకర్‌ దాదా ఎమ్‌బీబీఎస్‌’ సినిమాలో కూడా చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించారు. తర్వాత అందరి వాడులోనూ నటించారు. 2021లో వచ్చిన ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా మారారు. మొదటి సినిమాతోనే సూపర్‌ హిట్‌ను అందుకున్నారు.

ఈ చిత్రం వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. వైష్ణవ్‌ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు. హీరోగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘ఆదికేశవ’ విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాలో వైష్ణవ్‌ సరసన శ్రీలీల నటించారు. ఈ చిత్రం నవంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో వైష్ణవ్‌ తేజ్‌కు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ న్యూస్‌ మీడియా సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది.

ఆ వార్త ఏంటంటే.. వైష్ణవ్‌ తేజ్‌, హీరోయిన్‌ రీతూ వర్మ ప్రేమలో ఉన్నారట. అందుకే ఆమె వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠిల పెళ్లికి ముందు జరిగిన పార్టీలకు వచ్చారట. పెళ్లిలో కూడా సందడి చేశారట. వైష్ణవ్‌ తేజ్‌తో లవ్‌ ఎఫైర్‌ కారణంగానే ఆమె వరుణ్‌-లావణ్యల పెళ్లికి ప్రత్యేక అతిధిగా వెళ్లారని ప్రచారం మొదలైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. ఇక, ఈ పుకార్లపై వైష్ణవ్‌ తేజ్‌ తాజాగా స్పందించారు. రీతూతో లవ్‌ పుకార్లపై క్లారిటీ ఇచ్చారు.

ఆదికేశవ ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో రీతూతో లవ్‌పై వైష్ణవ్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. వైష్ణవ్‌ దానికి సమాధానం ఇస్తూ నవ్వారు.. రీతూ వర్మకు లావణ్య త్రిపాఠితో మంచి స్నేహం ఉందని ఆయన తెలిపారు. ఆ స్నేహం కారణంగానే రీతూ వరుణ్‌- లావణ్యల పెళ్లికి వచ్చారని.. మెగా ఫ్యామిలీతో కలిసి సందడి చేశారని అన్నారు. మెగా హీరోలతో ఆమెకు ఎలాంటి రిలేషన్‌ లేదని క్లారిటీ ఇచ్చారు. సోషల్‌ మీడియా, మీడియాలో వస్తున్న పుకార్లలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. కాగా, గతంలో వైష్ణవ్‌.. కేతిక శర్మతో లవ్‌లో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై అప్పట్లోనే ఆయన క్లారిటీ ఇచ్చారు. మరి, రీతూ వర్మతో లవ్‌ ఎఫైర్‌పై వైష్ణవ్‌ తేజ్‌ ఇచ్చిన క్లారిటీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetcell girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom