iDreamPost
android-app
ios-app

యూత్ హీరోకు వేకప్ కాల్

  • Published Sep 07, 2022 | 1:41 PM Updated Updated Dec 20, 2023 | 6:38 PM

ఈ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వైష్ణవ్ తేజ్ కి డెబ్యూ మూవీ ఉప్పెన ఆ స్థాయిలో బ్లాక్ బస్టర్ కావడం ఊహించనిది. దెబ్బకు నిర్మాతలు క్యూ కట్టేశారు.

ఈ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వైష్ణవ్ తేజ్ కి డెబ్యూ మూవీ ఉప్పెన ఆ స్థాయిలో బ్లాక్ బస్టర్ కావడం ఊహించనిది. దెబ్బకు నిర్మాతలు క్యూ కట్టేశారు.

యూత్ హీరోకు వేకప్ కాల్

ఇద్దరు స్టార్ మావయ్యల అండ, ఆల్రెడీ ఇండస్ట్రీలో సెటిలైన అన్నయ్య, మంచి పొజిషన్లలో మరికొందరు కుటుంబ సభ్యులు. ఈ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వైష్ణవ్ తేజ్ కి డెబ్యూ మూవీ ఉప్పెన ఆ స్థాయిలో బ్లాక్ బస్టర్ కావడం ఊహించనిది. దెబ్బకు నిర్మాతలు క్యూ కట్టేశారు. క్రిష్ అంతటి అగ్ర దర్శకుడే పవన్ కళ్యాణ్ మూవీకి గ్యాప్ వచ్చిందని తనతో కొండపొలం చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించేందుకు ఎస్ చెప్పింది. కీరవాణి సంగీతం తోడయ్యింది. వెరసి ప్రమోషన్లు గట్రా బాగా చేసుకున్నారు. ఒక అద్భుతమైన నవలని అంతే స్థాయిలో తెరకెక్కించడంతో జరిగిన తడబాటు వల్ల ఆ సినిమా కనీస స్థాయిలో ఆడలేకపోయింది.
A wakeup call to youth hero
కట్ చేస్తే ఇప్పుడు రంగ రంగ వైభవంగా రూపంలో మరో డిజాస్టర్ తోడయ్యింది. చేసిందే మూడు. అందులో రెండు దారుణమైన ఫలితాలంటే అవి ఖచ్చితంగా మార్కెట్ మీద ప్రభావం చూపిస్తాయి. ఎనిమిది కోట్ల బిజినెస్ లో అయిదు కోట్లకు పైగా నష్టం రావడమంటే అది చిన్న విషయం కాదు. తాను క్రౌడ్ పుల్లర్ స్థాయికి చేరుకోలేదని వైష్ణవ్ కు క్లారిటీ వచ్చేసింది. సాదా సీదా కథలతో అభిమానులను ఫస్ట్ డేనే హౌస్ ఫుల్ చేసేంత రేంజ్ రాలేదని ఫ్యాన్స్ స్పష్టత ఇచ్చారు. అంతెందుకు అన్నయ్య సాయి ధరమ్ తేజ్ సైతం వరస ఫ్లాపులతో ఈ ఇబ్బందిని ఎదురుకున్న వాడే. పైగా వైష్ణవ్ కు యాక్టింగ్ పరంగా ఇంకా మెరుగుపడాల్సింది చాలా ఉంది.

ఈ నేపథ్యంలో ఇతను సబ్జెక్టు సెలక్షన్ లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వచ్చేసింది. రోజులు మునుపటిలా లేవు. మొదటి సినిమా వంద కోట్లు చేసింది కదానే ఓవర్ కాన్ఫిడెన్స్ తో కథలను ఎంచుకుంటే ఇలాగే బోర్లా పడాల్సి ఉంటుంది. ఒకప్పుడు నువ్వే కావాలితో ఇండస్ట్రీ హిట్ కొట్టాక హీరో తరుణ్ కి తిరుగు ఉండదనుకున్నారు. కట్ చేస్తే పట్టుమని అయిదేళ్ళు కుదురుగా ఉండలేక త్వరగా రిటైర్ అవ్వాల్సి వచ్చింది. వరుణ్ సందేశ్, ఉదయ్ కిరణ్ ల కెరీర్ లు దగ్గరి నుంచి చూసినవాళ్ళమే. సో ఉప్పెన హిట్టు గాలివాటం కాదని నిరూపించాలంటే మరో బలమైన కంటెంట్ అవసరం. అది ఏ రూపంలో ఎవరిస్తారో చూడాలి