iDreamPost
android-app
ios-app

Kondapalli – ముగిసిన కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక.

Kondapalli – ముగిసిన కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక.

దాదాపుగా వారం రోజుల నుంచి ఉత్కంఠ రేపుతున్న కొండపల్లి పురపాలక సంఘం చైర్మన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి విజయం సాధించిన సిహెచ్ చిట్టిబాబుని ఆ పార్టీ సభ్యులు ఎన్నుకున్నారు. టీడీపీకి 16 మంది సభ్యుల బలం ఉండగా వైసీపీకి 15 మంది సభ్యుల బలం మాత్రమే ఉండటంతో వైసీపీ చేజార్చుకుంది. ఈ విషయంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ముందు నుంచి పట్టుదలగా వ్యవహరించినా సరే వైసిపి బలం తక్కువగా ఉండటంతో టీడీపీ కైవసం చేసుకుంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫీషియో సభ్యుడిగా టీడీపీకి మద్దతు ఇచ్చారు.

వైసీపీ నుంచి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించుకున్న సరే వైసీపీ బలం కేవలం 15 మాత్రమే అయింది. వైస్ చైర్మన్ గా శ్రీలక్ష్మిని అలాగే చుట్టకుదురు శ్రీనివాసరావుని సభ్యులు ఎన్నుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు కాసేపటి క్రితం కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పూర్తయింది. ఇక ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కృష్ణా జిల్లా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేయడం… అలాగే ఇతర ప్రాంతాల వారిని మున్సిపల్ కార్యాలయంలోకి అనుమతించక పోవడంతో ప్రశాంతంగా ఎన్నిక పూర్తి అయింది.

హైకోర్టు కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉండటంతో పోలీసులు కట్టుదిట్టంగా వ్యవహరించారు. టీడీపీ అభ్యర్థి చిట్టిబాబుకి 16 మంది అనుకూలంగా ఓటు వేయడంతో ఎన్నిక పూర్తి అయినట్టుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఇక ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీ కేశినేని నానికి కీలకంగా వ్యవహరించగా… వైసీపీ నుంచి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆ పార్టీ సభ్యులకు అండగా నిలబడ్డారు. వారం రోజుల నుంచి క్యాంపు రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయి ఏంటి అని ఎదురు చూస్తున్న తరుణంలో…

ఈ రెండు రోజుల నుంచి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడం ఎన్నిక వాయిదా పడటం జరుగుతూ వచ్చింది. 29 మంది సభ్యులున్న కొండపల్లి మున్సిపల్ స్థానానికి సంబంధించి 14 మంది తెలుగుదేశం పార్టీ నుంచి 14 మంది వైసీపీ నుంచి విజయం సాధించారు. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన వ్యక్తి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వగా ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించుకున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీ కి అనుకూలంగా ఓటు వేయడంతో కొండపల్లి టీడీపీ కైవసం అయింది.

Also Read : Kondapalli – కీలక దశలో కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక..