iDreamPost
android-app
ios-app

రాహుల్‌ బస్సు యాత్రలో అపశృతి.. కొండా సురేఖకు ప్రమాదం!

రాహుల్‌ బస్సు యాత్రలో అపశృతి.. కొండా సురేఖకు ప్రమాదం!

కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ భూపాలపల్లిలో బస్సు యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. బస్సు యాత్ర సందర్భంగా నిర్వహించిన బైక్‌ ర్యాలీలో రాహుల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. ఓ బైకు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి కిందపడిపోయింది. దీంతో ఆ బైకుపై ప్రయాణిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు కొండా సురేఖకు గాయాలయ్యాయి. ఆమె చేతికి ముఖానికి తీవ్రంగానే గాయాలయ్యాయి. దీంతో ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.

కాగా, కొండా సురేఖ ఆ బైకును నడుపుతున్న సందర్భంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆమె చాలా ఏళ్లుగా బైక్‌ నడపలేదు. దీంతో ఆమెకు ప్రాక్టీస్‌ పోయింది. అయినప్పటికి ఆమె బైకు నడపటంతో కంట్రోల్‌ తప్పి ప్రమాదం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి పట్టణంలో కాంగ్రెస్‌ నాయకులు బైక్‌ ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని జెన్‌కో అతిథిగృహం నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్‌ నేత మధుయాష్కీ, కొండ దంపతులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున ఈ ర్యాలీకి తరలివచ్చారు.

అందరితో పాటు కొండా సురేఖ బైకు నడపటానికి ప్రయత్నించారు. అలవాటు తప్పిపోవటం వల్ల కిందపడిపోయారు. ర్యాలీ సందర్భంగా రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. ‘‘ ఇది దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య పోటీ. తెలంగాణలో కుటుంబ పాలన జరుగుతోంది. ఒకే కుటుంబం పాలిస్తోంది. తెలంగాణలో అవినీతి రాజ్యం ఏలుతోంది. బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒక్కటే.. ’’ అని అన్నారు. మరి, బైక్‌ ర్యాలీలో కొండా సురేఖ గాయపడ్డంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.