కాంగ్రెస్ లో చేరికకు కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి ముహూర్తం ఫిక్స్!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఆలస్యం చేస్తూ వస్తుంది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఆలస్యం చేస్తూ వస్తుంది.

తెలంగాణ ఎన్నికల వేల రాజకీయాలు హీటెక్కిపోతున్నాయి. ఎవరు ఏ పార్టీ నుంచి తప్పుకుంటారో.. ఏ కండువా కప్పుకుంటారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరోవైపు అధికార పార్టీ బీఆర్ఎస్ మాత్రం ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ఖారు చేసి.. బీ-ఫారాలు ఇచ్చి ప్రచారంలో దూసుకువెళ్తుంది. ఇక ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు మాత్రం అభ్యర్థుల విషయంలో జాప్యం చేస్తూ వస్తున్నారు. ఈ సమయంలోనే బీజేపీకి మరో పెద్ద షాక్ తగిలింది. ఇప్పటి వరకు ఉత్కంఠకు తెరదించుతూ మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీకి రాజానామా చేశారు. తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన కూడా రిలీజ్ చేశారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ లో కొత్త జోష్ వచ్చిందని.. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. కొంతకాలంగా కాంగ్రెస్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ పార్టీకి రాజీనామా చేసి మునుగోడు ఉప ఎన్నికలకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏడాదిలోపే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను ఎందుకు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నా అన్న విషయంపై ప్రకటన ద్వారా క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో ప్రతి పౌరుడు అధికార పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీఆర్ఎస్ పార్టీకి సరైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని భావిస్తున్నారని.. తెలంగాణ ప్రజల ఆశలు మరో 5 వారాల్లో నెరవేరబోతున్నాయని అన్నారు. ఏడాది క్రితం బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తూ వచ్చిన బీజేపీలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలతో పూర్తిగా డీలా పడిపోయిందని అన్నారు. తనకు పదవులు కాదు.. ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం కాంగ్రెస్.. అందుకే ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

15 నెళ్ళ క్రితం తాను కాంగ్రెస్ పార్టీకి అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మునుగోడు ఎన్నికల బరిలో దిగి బీఆర్ఎస్ పార్టీని దాదాపు ఓడించినంత పని చేశానని ప్రకటనలో తెలిపారు. మునుగోడులో ప్రచారం కోసం బీఆర్ఎస్ ఏకంగా వందమంది ఎమ్మెల్యేలను ప్రచారానికి దింపి, వందకోట్ల నగదును కుమ్మరించిందిన, అధికార దుర్వినియోగానికి పాల్పపడిందని ప్రకటనలో పేర్కొన్నారు. తాను బీజేపీలో ఉన్న సమయంలో మునుగోడు ఉప ఎన్నికల్లో నా తరుపు ప్రచారం చేసిన బీజేపీ నేతలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రస్తుతం తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం కోసం కాంగ్రెస్ గట్టి కృషి చేస్తుందని..  ప్రస్తుతం అధికార మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. కేసీఆర్ సర్కార్ పై యుద్దం చేయాలని ప్రోత్సహించిన కేంద్ర మంత్రి అమిత్ షాకి నేను ఎప్పికటీ రుణపడి ఉంటానని అన్నారు. ఇక తెలంగాణ ప్రజల ఆలోచనల మేరకు పార్టీ మారాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నానని ఇది అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.

గత కొంత కాలంగా బీజేపీతో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్న రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నారని ప్రచారాలు జరిగాయి. ప్రధాని మోదీ భారీ బహిరంగ సభలకు కూడా డుమ్మాకొట్టారు. అంతేకాదు సెలక్షన్ కమిటీ చైర్మన్ గా కీలక పదవి ఇస్తామన్నా తిరస్కరించారు. ఇటీవల బీజేపీ రిలీజ్ చేసిన 52 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల లీస్ట్ లో ఆయన పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఆయన బీజేపీకి దూరం అవుతున్నారని వార్తలు దుమారం రేపాయి. మొత్తానికి ఆయన బీజేపీకి రాజీనామా చేసినట్టు అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చింది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. ఈ నెల 27వ తేదీన ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Show comments