iDreamPost
android-app
ios-app

Nani ,vamsi -కొడాలి నాని ,వంశీ మరికొందరు ఎమ్మెల్యే లకు భద్రత పెంపు

Nani ,vamsi -కొడాలి నాని ,వంశీ మరికొందరు ఎమ్మెల్యే లకు భద్రత పెంపు

ఆంధ్రప్రదేశ్ శాసన సభా సమావేశాల్లో కొన్ని ఘటనల నేపధ్యంలో కొందరికి భద్రతను ఏపీ ప్రభుత్వం పెంచింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుని వైసీపీ నేతలు సభలో తీవ్ర వ్యాఖ్యలతో విమర్శించారు అనే ఆరోపణలు టీడీపీ నుంచి వచ్చాయి. అది నిజమా కాదా అనే దానిపై స్పష్టత లేకపోయినా టీడీపీ కార్యకర్తలు… చంద్రబాబు సభలో పెట్టుకున్న కన్నీరు, ఆ తర్వాత మీడియా సమావేశంలో ఏడ్చిన విధానం చూసి వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. టీడీపీ నేతలు వరుస మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి వార్నింగ్ లు ఇవ్వడం కూడా జరిగింది.

ఇక కొందరు టీడీపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేలకు ఫోన్ లు చేసి వార్నింగ్ లు ఇవ్వడం సంచలనం అయింది. ఈ నేపధ్యంలో అలెర్ట్ అయిన ప్రభుత్వం శాసనసభలో ఇటీవల జరిగిన పరిణామాలతో కొందరు ఎమ్మెల్యేలు , మంత్రి కొడాలి నానికి భద్రతను ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మంత్రి కొడాలి నానీకి ప్రస్తుతం ఉన్న 2+2 గన్ మెన్ల భద్రతో పాటు అదనంగా 1+4 గన్ మెన్ల భద్రతను కల్పించింది ఏపీ ప్రభుత్వం. కాన్వాయ్ లో అదనంగా మరో భద్రతా వాహనాన్ని కూడా ఏపీ ప్రభుత్వం యాడ్ చేసింది. కొడాలి నాని కి ఇకపై 7+7 భద్రతను కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మంత్రితో పాటుగా ఎమ్మెల్యేల భద్రత మీద కూడా దృష్టి పెట్టింది. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లకు ప్రస్తుతం ఉన్న 1+1 గన్ మెన్ ల తో పాటు అదనంగా 3+3 గన్ మెన్ భద్రతను ఏపీ ప్రభుత్వం కల్పించింది. ముగ్గురు ఎమ్మెల్యేలకు ఇకపై 4+4 భద్రతఉంటుందని ప్రభుత్వం తెలిపింది. చంద్రబాబుపై వ్యాఖ్యల అనంతరం సామాజిక మాధ్యమాల్లో వారికి బెదిరింపులు వచ్చినట్టుగా ఫిర్యాదులు అందిన నేపధ్యంలో ఫిర్యాదుల పరిశీలన అనంతరం వారి భద్రతను సమీక్షించిన సెక్యూరిటీ రివ్యూ కమిటీ… ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

తక్షణమే ఈ భద్రత అమలులోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇవాల్టి నుంచి మంత్రి కొడాలి, ఎమ్మెల్యేలు వంశీ, అంబటి, ద్వారంపూడిలకు అదనపు సిబ్బందిని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఇక చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. తాము అలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టంగా చెప్పగా… సిఎం జగన్ కూడా అటువంటి వ్యాఖ్యలు తమ ఎమ్మెల్యేలు చేయలేదని అన్నారు.

Also Read : Kondapalli – ముగిసిన కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక.