iDreamPost
android-app
ios-app

కోహ్లీ సెంచరీ వద్దనుకున్నాడు కానీ నేనే.. కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Author Soma Sekhar Updated - 07:00 PM, Fri - 20 October 23

అసాధ్యాలను సుసాధ్యాలుగా మలచడం విరాట్ కు వెన్నతో పెట్టిన విద్య. అయితే విరాట్ సెంచరీపై మ్యాచ్ అనంతరం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్. ఈ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ వద్దన్నాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు రాహుల్.

అసాధ్యాలను సుసాధ్యాలుగా మలచడం విరాట్ కు వెన్నతో పెట్టిన విద్య. అయితే విరాట్ సెంచరీపై మ్యాచ్ అనంతరం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్. ఈ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ వద్దన్నాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు రాహుల్.

  • Author Soma Sekhar Updated - 07:00 PM, Fri - 20 October 23
కోహ్లీ సెంచరీ వద్దనుకున్నాడు కానీ నేనే.. కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

అదే జోరు.. అదే ఆధిపత్యం.. వరల్డ్ కప్ లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. వరుసగా నాలుగో విజయంతో.. ప్రపంచ కప్ ను ముద్దాడే దిశగా దూసుకెళ్తోంది. ఇక ఈ విజయంతో సెమీఫైనల్ కు మరింతగా చేరువైంది. తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది భారత జట్టు. కింగ్ విరాట్ కోహ్లీ మరోసారి ఛేజ్ మాస్టర్ పాత్ర పోషించి.. అజేయ శతకంతో కదంతొక్కగా.. గిల్(53), రోహిత్(48) పరుగులతో రాణించారు. ఇక ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం అసాధ్యం అనుకున్నారు. కానీ అసాధ్యాలను సుసాధ్యాలుగా మలచడం విరాట్ కు వెన్నతో పెట్టిన విద్య. అయితే విరాట్ సెంచరీపై మ్యాచ్ అనంతరం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్. ఈ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ వద్దన్నాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు రాహుల్.

ఇండియా-బంగ్లా మ్యాచ్ టీమిండియా విజయానికి ఇంకా 27 పరుగులు అవసరం. క్రీజ్ లో విరాట్ కోహ్లీ 74 పరుగులతో ఉన్నాడు. మరోవైపు కేఎల్ రాహుల్ ఉన్నాడు. దీంతో కోహ్లీ సెంచరీ చేయడం అసాధ్యమని అందరూ అనుకున్నారు. కానీ.. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి కేఎల్ రాహుల్ వారధిగా నిలిచాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ సాధిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. అలాగే అవకాశం ఉన్నాగానీ సెంచరీ వద్దనుకున్నాడు విరాట్. కానీ కేఎల్ రాహుల్ పట్టుబట్టడంతో.. చివరకు శతకాన్ని అందుకున్నాడు రన్ మెషిన్. ఈ విషయాన్ని స్వయంగా మ్యాచ్ అనంతరం వెల్లడించాడు రాహుల్.

రాహుల్ మాట్లాడుతూ..”కోహ్లీ సింగిల్ తీద్దాం అంటే నేనే వద్దని చెప్పా. కానీ సింగిల్స్ తీయకపోతే.. జనాలు, ఫ్యాన్స్ వ్యక్తిగత రికార్డుల కోసం ఆడుతున్నానని అనుకుంటారని కోహ్లీ చెప్పాడు. అయితే మనం ఎలాగో గెలుస్తాం.. అలాంటప్పుడు సెంచరీ కోసం ప్రయత్నించడంలో తప్పులేదు, నువ్వు సెంచరీ పూర్తి చెయ్” అని చెప్పానని రాహుల్ చెప్పుకొచ్చాడు. ఇక్కడ రాహుల్ చేసిన మరో గొప్ప పని ఏంటంటే? విరాట్ 74 పరుగులతో ఉన్నప్పుడు.. విజయానికి 26 పరుగులు అవసరం. అయితే ఆ తర్వాత నుంచి కేఎల్ రాహుల్ ఒకే ఒక్క బంతి మాత్రమే ఆడాడు. విరాట్ సింగిల్స్ కోసం ప్రయత్నించినా.. రాహుల్ వెళ్లలేదు. దీంతో 41 ఓవర్లు ముగిసే సరికి కోహ్లీ 97 పరుగులతో క్రీజ్ లో ఉండగా.. విజయానికి కేవలం 2 రన్స్ మాత్రమే కావాలి.

ఈ క్రమంలో 42వ ఓవర్ తొలి బంతిని బంగ్లా బౌలర్ వైడ్ వేశాడు. కానీ దానిని అంపైర్ వైడ్ గా ప్రకటించకపోవడంతో.. నెక్ట్స్ బాల్ ను సిక్స్ బాది మరో శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా.. కేఎల్ రాహుల్ తన మంచి మనసు చాటుకుని విరాట్ శతకానికి తోడ్పడ్డాడని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. జట్టులో ఓపెనర్లు లిటన్ దాస్(66), తంజిద్ హసన్(51), మహ్మదుల్లా(46) పరుగులతో రాణించారు. ఇండియా బౌలర్లలో జడేజా, బుమ్రా, సిరాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కింగ్ విరాట్ కోహ్లీ 97 బంతుల్లో 6 ఫోర్లు,4 సిక్స్ లతో 103 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగతా వారిలో కెప్టెన్ రోహిత్ శర్మ(48), గిల్(53), రాహుల్(34*) పరుగులతో రాణించారు. మరి ఈ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీకి సాయం చేసిన కేఎల్ రాహుల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.