iDreamPost
android-app
ios-app

నిజమైన విజేత నాగార్జునే

  • Published Dec 22, 2020 | 6:51 AM Updated Updated Dec 22, 2020 | 6:51 AM
నిజమైన విజేత నాగార్జునే

కరోనా కలకలంలో వంద రోజులకు పైగా వినోదాన్ని పంచిన బిగ్ బాస్ 4 ఫైనల్ గా మొన్న ముగిసింది. అభిజిత్ టైటిల్ గెలిచాడు, సొహైల్ ప్రేక్షకుల హృదయాలు గెలిచాడని ఏవేవో కామెంట్లు, వివాదాలు సోషల్ మీడియాలో సాగుతూనే ఉన్నాయి. వీటి సంగతలా ఉంచితే పార్టిసిపెంట్స్ విషయంలో మాత్రం ప్రేక్షకులు మునుపటి మూడు సీజన్లతో పోలిస్తే అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవం. హౌస్ లోకి వచ్చి సెలబ్రిటీ అయినవాళ్లే ఎక్కువ కానీ ఆల్రెడీ పేరున్న వాళ్ళు ఓ నలుగురు ఉన్నారంతే. ఇది ఒక రకంగా మైనస్ అయ్యింది కూడా. ఇక ఈ సంగతి కాసేపు పక్కనపెడితే నాగార్జున పెర్ఫార్మన్స్ మీద ఓ లుక్ వేద్దాం

మూడున్నర నెలలు వారానికి రెండు ఎపిసోడ్ల చొప్పున బిగ్ బాస్ కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తూ రేటింగ్ కాపాడింది ముమ్మాటికీ అక్కినేని నాగార్జునే. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. సభ్యుల పట్ల తను వెలిబుచ్చిన అభిప్రాయాలు, ప్రవర్తన అంతా కూడా షో దర్శకులు, నిర్వాహకులు సూచన రచన మేరకే సాగింది తప్ప వ్యక్తిగతంగా తనకంటూ ఎలాంటి ఛాయస్ ఉండదు. ఆ బాధ్యతను నాగ్ వంద శాతం పర్ఫెక్ట్ గా నెరవేర్చాడు. దానికి శని ఆదివారాలలో వచ్చిన టిఆర్పి రేటింగ్స్ నే సాక్ష్యంగా చూపించుకోవచ్చు. వయసుతో సంబంధం లేకుండా తన గ్లామర్ తో నాగార్జున షోకి నిండుతనం తేవడంలో ఎప్పుడూ ఫెయిల్ కాలేదు.

యాంకరింగ్ ఒక కళ. కెమెరా ముందు గొప్పగా రాణించిన ప్రతి నటుడు ఖచ్చితంగా వ్యాఖ్యాతగా కూడా సక్సెస్ అవుతాడన్న గ్యారెంటీ లేదు. చిరంజీవి అంతటి వాడే మీలో ఎవరు కోటీశ్వరుడుని రన్ చేసే విషయంలో నాగ్ ని ఓవర్ టేక్ చేయలేకపోయాడు. జూనియర్ ఎన్టీఆర్ స్థాయిలో నాని మెరుపులు బిగ్ బాస్ లో పనిచేయలేదు. ఆ లెక్కన చూసుకుంటే అందరికంటే నాగార్జునే టాప్ ప్లేస్ లో నిలిచాడు. అందుకే స్టార్ మా సైతం మూడు నాలుగు సీజన్లకు తనకంటే బెస్ట్ ఛాయస్ కనిపించలేదు. వచ్చే ఏడాది ఐదో సిరీస్ కు సైతం నాగార్జున కంటిన్యూ అయ్యే అవకాశాలు నూరు శాతం ఉన్నాయి. చూద్దాం ఇంకా చాలా టైం ఉందిగా