iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ కేంద్రంగా కిడ్నీ రాకెట్‌ దందా! పేదోళ్లని టార్గెట్ చేస్తూ దారుణాలు!

  • Published May 25, 2024 | 4:30 PMUpdated May 25, 2024 | 4:30 PM

ఆరోగ్యం బాగాలేకపోయినా, వివిధ ధీర్ఘకాలిక ఆనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారు నగరంలోని ఆసుపత్రికి వెళ్లాలనుకుంటున్నరా.. అయితే తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. హైదరాబాద్‌ నగరంలోనే కిడ్నీ రాకెట్‌ దందాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా వాళ్లనే ఎక్కువగా టార్గెట్‌ చేస్తూ మోసం చేస్తున్నారు.

ఆరోగ్యం బాగాలేకపోయినా, వివిధ ధీర్ఘకాలిక ఆనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారు నగరంలోని ఆసుపత్రికి వెళ్లాలనుకుంటున్నరా.. అయితే తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. హైదరాబాద్‌ నగరంలోనే కిడ్నీ రాకెట్‌ దందాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా వాళ్లనే ఎక్కువగా టార్గెట్‌ చేస్తూ మోసం చేస్తున్నారు.

  • Published May 25, 2024 | 4:30 PMUpdated May 25, 2024 | 4:30 PM
హైదరాబాద్ కేంద్రంగా కిడ్నీ రాకెట్‌ దందా! పేదోళ్లని టార్గెట్ చేస్తూ దారుణాలు!

నేటికాలంలో ఎక్కడ చూసిన అవినీతి,అక్రమా కార్యకలాపాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. చాలామంది ఈజీగా డబ్బను సంపాదించాలనే నేపథ్యంలో లేనిపోని దారుణాలకు ఒడిగడుతూ.. అడ్డదారులు తొక్కుతున్నారు. అయితే ఎక్కువగా పేద, మధ్యతరగతి ప్రజల అవసరాలను, ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకొని కొందరు ముఠ వారిని లోబర్చుకుని మాయ చేసి వివిధ దందాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మనుషుల శరీరంలోని అవయవాతో వ్యాపారం చేస్తూ.. పెద్ద దందానే కొనసాగిస్తున్నారు. తాజాగా నగరంలో కీడ్నీ రాకెట్‌ గుట్టు బయటపడిన విషయం తెలిసిందే. కాగా, ఈ దందా అనేది భాగ్యనగరంలో జరగడంతో ఈ కేసు తీవ్ర సంచాలనంగా మారింది. అలాగే ఈ దందాలో ప్రధాన సూత్రదారి నగరంలోని వైద్యుడు కావడం నగరవాసులకు భయంద్రోళనకు గురిచేసింది.

సాధారణంగా ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా, వివిధ ధీర్ఘకాలిక ఆనారోగ్య సమస్యలతో సతమతమవుతునే ముందుగా గుర్తుకు వచ్చేది హాస్పటిల్‌‌. ఇక ఈ హాస్పటిల్‌‌ కు వెళ్లి డాక్టర్‌ ను సంప్రాదింస్తే.. కాస్త ఆరోగ్యం కుదిటపడుతుందని నమ్మి హాస్పటిల్‌కు పరుగులు తీస్తారు. ఈ క్రమంలోనే ప్రజల అవసరాలను అవకాశంగా క్యాష్‌ చేసుకోవాలని కొంతమంది వైద్యులు చూస్తున్నారు. అందుకోసం ప్రముఖ హాస్పిటల్ పేరుతో.. వైద్యంకు వచ్చిన పేషెంట్‌ లకు ఎరగా వేసి వారిని మోసం చేస్తున్నారు. అలాగే మరికొంతమంది అమాయకపు ప్రజలను డబ్బు ఆశ చూపించి వారి దగ్గర కీడ్నీ సేకరించి.. వాటితో కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు.

ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఈ కిడ్నీ రాకెట్‌ ల గుట్టు అనేక సార్లు తెర పైకి వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. పేదోళ్లని టార్గెట్ చేస్తూ ఈ దారుణాలకు ఒడిగడుతున్న ఘటనలు గతంలో కూడా చాలానే జరిగాయి. అయితే ఈసారి నగరంలోనే అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ దందా వెలుగులోకి రావడంతో తీవ్ర కలకరం నెలకొంది. ముఖ‍్యంగా ఈ దందాలో హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్‌ ప్రధాన సూత్రధారి అంటూ ఆరోపణలు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కిడ్నీ రాకెట్‌ దందాకు హైదరాబాద్‌ నగరమే కేంద్రగా మారడంతో ప్రజలు ఆసుపత్రిలకు వెళ్లలంటేనే భయపడుతున్నారు.

ఏ ఆసుపత్రికైనా ఆరోగ్యం బాగోలేక వెళ్లానుకున్న నగరంలో జరుగుతున్న దందాల్లో వైద్యుల పాత్ర కూడా ఉంటుదేమోనని బిత్తరపోతున్నారు. ఇలా అమాయకపు ప్రజలను మోసం చేస్తూ వారి ఆవయవాలతో దందాను కొనసాగిస్తూ.. డబ్బులు సంపాదిస్తున్న ఆసుపత్రిలకి వెళ్లాలంటే.. ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిందే అంటూ వాపోతున్నారు. మరి కిడ్నీ రాకెట్‌ దందాలు  హైదరాబాద్‌ నగరంలోనే కేంద్రంగా కొనసాగడటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి