iDreamPost
iDreamPost
2018 చివర్లో విడుదలై దేశవ్యాప్తంగా సంచలన విజయం నమోదు చేసి శాండల్ వుడ్ స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన కెజిఎఫ్ చాఫ్టర్ 1 ని అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. అప్పటిదాకా బయట పెద్దగా గుర్తింపు లేని హీరో యష్ ఒక్కసారిగా ఓవర్ నైట్ హాట్ ఫేవరెట్ అయ్యాడు. దానికి కొనసాగింపు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ గత రెండేళ్లకు పైగా వేచి చూస్తూనే ఉన్నారు. గత ఏడాది లాక్ డౌన్ రాకపోయి ఉంటే ఈపాటికే చూసేసి ఉండేవాళ్ళం. కానీ ఛాన్స్ మిస్ అయ్యింది. అందుకే కొత్త సంవత్సరంలో తన అసలు కథ చెప్పేందుకు రాఖీ భాయ్ రెడీ అవుతున్నాడు. రేపు ప్లాన్ చేసుకున్న టీజర్ ని లీకుల బెడదతో కెజిఎఫ్ టీమ్ సెకండ్ చాప్టర్ టీజర్ ని ఇందాకే రిలీజ్ చేసింది.
కథ చెప్పకపోయినా వీడియోలో కొన్ని ముఖ్యమైన విజువల్స్ ని చూపించారు. కోలార్ గోల్డ్ మైన్స్ ని హస్తగతం చేసుకున్నాక రాఖీ భాయ్(యష్) తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తాడు. అధీరా(సంజయ్ దత్)నుంచి బంగారు గనులు చేజారకుండా అడ్డుగోడగా నిలుస్తాడు. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి చర్యలు మొదలవుతాయి. పోలీసులు కదిలి వస్తారు. మంత్రి(రవీనా టాండన్)స్థాయిలో రాజకీయం మొదలవుతుంది. మరి ఎవరూ చేరలేని, తాకలేని స్థాయికి చేరుకున్న రాఖీ జైత్ర యాత్రకు ఎలాంటి ముగింపు దొరికింది, అధీరాతో యుద్ధంలో గెలిచాడా లేదా అనేది త్వరలో విడుదల కాబోయే సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.
అభిమానుల అంచనాలకు తగ్గట్టే ట్రైలర్ ఫెంటాస్టిక్ గా ఉంది. ఫస్ట్ పార్ట్ కంటే ఇందులో డబుల్ ట్రిపుల్ డోస్ ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పినట్టే ఇందులో యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి. సంజయ్ దత్ ని రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. యష్ ఇంట్రో మాత్రం మాములుగా రచ్చగా లేదు. పోలీసు వాహనాలను బ్లాస్ట్ చేస్తూ ఫైర్ మెషిన్ నుంచి బులెట్లు బయటికి వచ్చి విధ్వంసం చేసాక దాని మీదే సిగరెట్ వెలిగించుకునే షాట్ ఓ రేంజ్ లో ఉంది. రవి బస్రూర్ నేపధ్య సంగీతం కొనసాగింపుగా ఉంది. భువన్ గౌడ ఛాయాగ్రహణం ప్రమాణాలు రెట్టింపయ్యాయి. మొత్తానికి కెజిఎఫ్ చాప్టర్ 2 అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లేలా ఉన్న ఈ టీజర్ యష్ పుట్టినరోజున అభిమానులకు పర్ఫెక్ట్ గిఫ్ట్ అనిపించుకుంది.
Teaser Link @ https://bit.ly/39cTRKj