వైరల్ వీడియో: దేవుడు కండక్టర్ రూపంలో ఇతనిని కాపాడాడు!

దైవం, మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వచ్చి మనల్ని ఆదుకుంటారో.. ప్రాణాల్ని తీసుకుని వెళ్తారో చెప్పడం కష్టం. ఇప్పుడు మేం చెప్పబోయే వార్తలో.. వీరిద్దరూ ఒకే సారి వచ్చారు. మరి చివరకు ఏం జరిగింది అంటే..

దైవం, మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వచ్చి మనల్ని ఆదుకుంటారో.. ప్రాణాల్ని తీసుకుని వెళ్తారో చెప్పడం కష్టం. ఇప్పుడు మేం చెప్పబోయే వార్తలో.. వీరిద్దరూ ఒకే సారి వచ్చారు. మరి చివరకు ఏం జరిగింది అంటే..

మృత్యువు ఎప్పుడు.. ఏ క్షణం.. ఎలా వచ్చి మనల్ని కబళిస్తుందో అర్థం కాదు. రాత్రి పడుకున్న వారు తెల్లారి సూర్యోదయాన్ని చూస్తారన్న గ్యారెంటీ లేదు. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా కనిపించిన వారు.. ఉన్నట్లుండి కుప్పకూలి కన్ను మూస్తున్న ఘటనలు గత కొన్నాళ్లుగా పెరుగుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్నారులు మొదలు.. యువత, వృద్ధులు ఇలా ఎందరో ఉన్నట్లుండి గుండెపోటుతో కుప్పకూలి.. కళ్ల ముందే కన్నుమూసిన ఘటనలు అనేకం వెలుగు చూశాయి. అయితే కొన్ని సందర్భాల్లో.. పక్కనే ఉన్న వారు సమయస్ఫూర్తితో వ్యవహరించి.. బాధితుల ప్రాణాలు కాపాడుతున్నారు. ఇక తాజాగా ఈ తరహా ఘటన ఒకటి వెలుగు చూసింది. దేవుడు కండక్టర్‌ రూపంలో వచ్చి ఓ యువకుడి ప్రాణాన్ని కాపాడాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

ఈ సంఘటన కేరళలో చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్‌ కండక్టర్‌ సమయస్ఫూర్తి.. ఓ యువకుడి ఓ ప్రాణాలు కాపాడింది. బస్సులో ఉన్న సీసీటీవీలో ఇందుకు సంబంధించిన దృశ్యాలు రికార్డ్‌ కావడంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. 19 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో కండక్టర్‌ డోర్‌ వద్ద.. తన పక్కనే నిలబడి ఉన్న ఇద్దరు ప్రయాణికులకు టికెట్లు ఇచ్చే పనిలో ఉంటాడు. అయితే డ్రైవర్‌ సడెన్‌గా బ్రేక్‌ వేయడంతో.. డోర్‌ దగ్గర ఉన్న ఓ యువకుడు పట్టు తప్పి కిందకు పడిపోతుంటాడు. అది గమనించిన కండక్టర్‌ వెంటనే స్పందించి.. యువకుడిని పైకి లాగడంతో.. సదరు ప్యాసింజర్‌ ప్రాణాలు దక్కాయి.

కండక్టర్‌ స్పందించడంలో ఏమాత్రం ఆలస్యం అయినా.. ఆ ప్రయాణికుడు రన్నింగ్‌ బస్‌లో నుంచి కింద పడి.. తీవ్రంగా గాయపడేవాడు.. లేదంటే అదృష్టం బాగాలేకపోతే ఏకంగా చనిపోయేవాడు. లేచిన వేళ బాగుండటంతో.. అతడు పడటాన్ని గమనించిన వెంటనే కండక్టర్‌ స్పందించి.. ఆ ప్రయాణికుడి చేయి పట్టుకుని పైకి లాగి.. అతడి ప్రాణాలు కాపాడాడు. ఇందకు సంబంధించిన వీడియో ఇప్పుడు ట్విట్టర్‌లో తెగ హల్చల్‌ చేస్తోంది. ఇక వీడియో చూసిన వారు.. నీ అదృష్టం బాగుంది.. ఆ కండక్టర్‌ స్పందించడం ఏమాత్రం ఆలస్యం అయినా.. ఇపాటికి యమపురికి లేదా.. ఆస్పత్రికి వెళ్లేవాడివి.. దేవుడే స్వయంగా కండెక్టర్‌ రూపంలో వచ్చి నీ ప్రాణాలు కాపాడాడు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. సదరు కండక్టర్‌ సమయస్ఫూర్తిని ప్రశంసిస్తున్నారు.

Show comments