iDreamPost
android-app
ios-app

రాంగ్ రూట్ లో వచ్చి.. అంబులెన్స్‌ను ఢీ కొట్టిన మంత్రి కాన్వాయ్!

రాంగ్ రూట్ లో వచ్చి.. అంబులెన్స్‌ను ఢీ కొట్టిన మంత్రి  కాన్వాయ్!

సాధారణంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే.. ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు హెచ్చరిస్తుంటారు. అందుకే  అందరూ ట్రాఫిక్ రూల్స్ ను తప్పనిసరిగా ఫాలో అవుతుంటారు. ఇలాంటి విషయాల్లో ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు సామాన్య ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. చాలా ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూనే తమ వాహనాలను నడుపుతుంటారు. అయితే కొందరు మాత్రం అధికారం మదంతో ఇష్టమెచ్చినట్లు వెళ్లి.. అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటారు. తాజాగా రాంగ్ రూట్ లో వచ్చిన ఓ మంత్రి కారు.. అంబులెన్స్ ను ఢీ కొట్టింది. దీంతో అందులోని పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది.  పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బుధవారం కేరళ రాష్ట్ర  విద్యాశాఖ మంత్రి శివన్‌కుట్టీ చెందిన కాన్వాయ్‌లోని పైలట్‌ వాహనం తిరువనంతపురంలో బీభత్సం సృష్టించింది. రద్దీగా ఉండే కూడలిలో రాంగ్‌ రూట్‌లో వచ్చి.. అంబులెన్స్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న రోగి సహా ముగ్గురు గాయపడ్డారు. ఇంకా అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వారిని వెంటనే మరో వాహనంలో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.

అంబులెన్స్ డ్రైవర్ తో పాటు మంత్రి పైలెట్ వాహన చోదకుడిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం తిరువనంతపురంలోని ఓ రద్దీ కూడలి నుంచి మంత్రి శివన్‌కుట్టీ కాన్వాయ్‌ వెళ్లాల్సి ఉంది. ముందుగానే అప్రమత్తమైన పోలీసులు కూడలిలో ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. ఓ ద్విచక్ర వాహనదారుడు దాదాపు కూడలి మధ్య వరకు వచ్చేసి పోలీసుల ఆపివేయడంతో నిలిచిపోయాడు. సాధారణంగా రోడ్డుకు ఎడమవైపు నుంచి రావాల్సిన మంత్రి కాన్వాయ్‌.. ట్రాఫిక్‌ను తప్పించుకునేందుకు కుడివైపు నుంచి వచ్చింది. అదే సమయంలో మరో రూట్ నుంచి వేగంగా వస్తున్న అంబులెన్స్‌ కూడలి దాటే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో పైలట్‌ వాహనం అంబులెన్స్‌ను బలంగా ఢీ కొట్టింది.

దీంతో అంబులెన్స్ కాస్తా బోల్తా కొట్టి.. దొర్లుకుంటూ పోయి కాస్తా దూరంలో పడింది. ఇదే సమయంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ను ఢీ కొట్టబోగా.. అతడు చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఇక మంత్రి పైలట్‌ వాహనం ఎదురుగా ఉన్న ద్విచక్రవాహన దారుడిని ఢీ కొట్టి ఆగిపోయింది.  అయితే ప్రమాదం గురించి తెలిసి కూడా మంత్రి వాహనం మాత్రం ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మంత్రిపై నెటిజన్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆస్పత్రిలో గొడవ పడ్డ పేషెంట్స్.. నిద్రపోయిన టైమ్ చూసి బెడ్ పైనే హత్య!