సీఎం చెప్పారనే చదువుతున్నాను – కేరళ గవర్నర్

కేరళ అసెంబ్లీలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. కేరళలోని వామపక్ష సర్కారు కేంద్రం అమలు చేస్తున్న సీఏఏ వంటి విధానాలను వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం కూడా చేసారు. ఈ మేరకు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ బుధవారం ఆ తీర్మానానికి సంబంధించిన కాపీని చదవాల్సి వచ్చింది. ‘ఆ తీర్మానం తన అభిప్రాయానికి అనుగుణంగా లేనప్పటికీ ముఖ్యమంత్రి పట్టుబట్టి మరీ ఆ తీర్మానాన్ని చదవమన్నారని, అందుకే చదువుతున్నానని అన్నారు. దీంతో మొత్తం సభలో గందరగోళం నెలకొంది. ఇదిలా ఉండగా సభ ప్రారంభానికి ముందే సభ్యులు సీఏఏ ను వ్యతిరేకిస్తూ ప్ల కార్డులతో గవర్నర్ కు ఎదురొచ్చారు. గవర్నర్ గో బ్యాక్ అంటూ నినదించారు.

Show comments