iDreamPost
android-app
ios-app

విశ్వాసానికి అందలం.. దళిత మహిళా నేతకు జెడ్పి పదవి

విశ్వాసానికి అందలం.. దళిత మహిళా నేతకు జెడ్పి పదవి

ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికలు ఏమో గాని అధికార పార్టీలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరు బాధ్యతలు చేపడతారు ఏంటి అనే దానిపై ప్రతి జిల్లాలో కూడా ఒక రకమైన ఆసక్తి నెలకొంది. ప్రధానంగా రాయలసీమ జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో దీనికి సంబంధించి ఉత్కంఠ కొనసాగింది. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు సంబంధించి పార్టీ అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుంది ఏంటనే దానిపై అందరూ ఆసక్తికరంగా చూసారు. కృష్ణ, గుంటూరు జిల్లాల విషయంలో కూడా ఆసక్తికర చర్చలు జరిగిన పెద్దగా హైలెట్ కాలేదు గాని పార్టీ విధానాల పట్ల గౌరవం ఉన్న వారిపై మాత్రం పార్టీ అధిష్టానం నమ్మకం ఉంచింది.

Also Read : నాడు ఎమ్మెల్యే పదవి మిస్ ,నేడు జడ్పీ చైర్మన్

గుంటూరు జిల్లాకు సంబంధించి కత్తెర క్రిస్టియానా జిల్లా పరిషత్ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు. 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ పై అభిమానంతో పార్టీ కోసం కష్టపడి తాడికొండ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. అప్పుడు టిడిపి అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ పై ఆమె స్వల్ప తేడాతో ఓడిపోయినా… ఆ తర్వాత మాత్రం పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుకుగా పాల్గొని దాదాపు పార్టీని అమరావతి ప్రాంతంలో బలోపేతం చేశారు.

Also Read : విజయనగరం జెడ్పీ పీఠం చిన్న శ్రీనుకే..

అమరావతి ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్న తెనాలి శ్రావణ్ కుమార్ ను ఆమె బాగా ఇబ్బంది పెట్టారు. అయితే 2019 ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారని భావించిన అనూహ్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్… ఆ నియోజకవర్గం నుంచి కొత్త వారికి అవకాశం ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ లేదా జడ్పీ చైర్మన్ గా అవకాశం కల్పిస్తానని జగన్ అప్పుడు ఆమెకు హామీ ఇచ్చినట్టుగా తెలిసింది. దీనితో సీట్ రాకపోయినా సరే ఏమాత్రం వెనకడుగు వేయకుండా క్రిస్టియాన, తాడికొండ నియోజకవర్గంలో డాక్టర్ శ్రీదేవి విజయానికి సహకరించారు.

Also Read : తూర్పు జెడ్పీ పీఠంపై ‘వేణు’గానం

హైదరాబాదులో డాక్టర్గా పనిచేస్తున్న శ్రీదేవికి నియోజకవర్గంపై పూర్తిగా అవగాహన లేకపోయినా సరే ప్రచారంలో అన్నీ తానై వ్యవహరించారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలను ఏకం చేయడమే కాకుండా రాజధాని అమరావతి లో రైతులకు జరిగిన అన్యాయాన్ని కూడా ఆమె బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. కొన్ని కీలక కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా పార్టీ అధిష్టానానికి కూడా తన విధేయతను చాటుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆమె పై నమ్మకం ఉంచి జడ్పీ చైర్మన్ గా అవకాశం కల్పించారు.

Also Read : మాజీ ఎమ్మెల్యే శ్రీమతికి సిక్కోలు జెడ్పీ పీఠం

గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా కత్తెర క్రిస్టినాను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులు… జెడ్పీ వైస్ చైర్మన్లుగా శొంఠిరెడ్డి నర్సిరెడ్డి, బత్తుల అనురాధను ఎన్నుకున్నారు..జిల్లాలోని 52 జెడ్పీటీసిలు వైకాపాకు చెందిన వారే కావటంతో పోటీ లేకుండా ఎన్నిక పూర్తి అయింది. ఈ నెల 22 సాయంత్రం ఆమెకు వైసీపీ అధిష్ఠానం బి.ఫామ్ ను అందించింది. హోంశాఖ మంత్రి మేకతోటి సుచ‌రిత, రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకట రమణ, అలాగే గుంటూరు జిల్లా ఇంఛార్జి మంత్రి చెరుకువాడ రంగరాజు, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్ రావు పార్టీ బీఫాం అందించారు.

Also Read : కొత్త ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఎప్పటి వరకు పదవిలో ఉంటారో తెలుసా?