iDreamPost
android-app
ios-app

అన్నయ్య దారిలోనే తమ్ముడు ?

  • Published Dec 26, 2020 | 1:10 PM Updated Updated Dec 26, 2020 | 1:10 PM
అన్నయ్య దారిలోనే తమ్ముడు ?

కోలీవుడ్ లో మొదట ఓటిటి బాట పట్టిన స్టార్ హీరోగా సూర్య చేసిన సాహసం గురించి ఇప్పటికీ అక్కడ సినీ జనాలు చెప్పుకుంటూనే ఉంటారు. డిస్ట్రిబ్యూటర్లు ఎంత బెదిరించినా నెరవకుండా తన నిర్మాణంలో వచ్చిన బంగారు తల్లి, ఆకాశం నీ హద్దురా స్ట్రెయిట్ డిజిటల్ రిలీజ్ చేయడం ద్వారా తనతో పాటు ఎందరినో ఆర్థికంగా సేఫ్ చేయడం నిజంగా మెచ్చుకోదగిన విషయమే. ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆకాశం నీ హద్దురా పాజిటివ్ టాక్ వచ్చినా సరే సగం సీట్లతో దానికైన బడ్జెట్ వెనక్కు తెచ్చేది కాదు. అందుకే అన్నీ ఆలోచించి సూర్య తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాన్ని ఇచ్చింది.

తాజాగా సూర్య తమ్ముడు కార్తీ కూడా ఇదే దారిలో వెళ్లొచ్చని చెన్నై టాక్. ఇతని కొత్త సినిమా సుల్తాన్ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. గతంలో శివ కార్తికేయన్, కీర్తి సురేష్ లతో రెమో తీసిన బక్కియరాజ్ కణ్ణన్ దీనికి దర్శకుడు. ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రష్మిక మందన్న హీరోయిన్ కావడం మరో అదనపు ఆకర్షణ. ఇప్పుడీ సుల్తాన్ ని డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేయబోతున్నట్టు వస్తున్న వార్తలు అభిమానులను టెన్షన్ పెడుతున్నాయి. ఒకపక్క థియేటర్లు తెరిచాకా ఇలా చేయడం ఏమిటని అడుగుతున్నారు. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ టాక్స్ అయితే జరిగాయట.

ఇలా ఆలోచించేందుకు కారణం లేకపోలేదు. ఈ సగం సీట్ల ఆక్యుపెన్సీ నిబంధన ఇంకెంత కాలం ఉంటుందో అర్థం కావడం లేదు. జనవరి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయినా సరే విజయ్ మాస్టర్ బరిలో దిగేందుకు సిద్ధమయ్యింది. దీన్ని తప్ప ఇంకే పోటీ సినిమా ఉండకూడదని ఇప్పటికే పంపిణీదారులు డిమాండ్ చేస్తున్నారు. సో సుల్తాన్ కు పొంగల్ రేస్ ఛాన్స్ లేదు. అలా వదిలేస్తే మళ్ళీ వేసవి దాకా ఎదురు చూడాల్సి వస్తుంది. ఇదంతా అంత సులువుగా తేలే వ్యవహారం కాదు కాబట్టి సుల్తాన్ టీమ్ చర్చల్లో ఉన్నట్టు సమాచారం. ఇంకొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన స్పష్టత రావొచ్చు