iDreamPost
android-app
ios-app

ఏపీ బాటలో కర్ణాటక-జగన్ బాటలో యడ్యూరప్ప

ఏపీ బాటలో కర్ణాటక-జగన్ బాటలో యడ్యూరప్ప

వినూత్న పథకాలు ఆలోచనలతో ముందుకు సాగుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరో రాష్ట్రానికి మార్గదర్శకుడయ్యారు. దిశ చట్టం ప్రవేశపెట్టి ఒరిస్సా వంటి పలు రాష్ట్రాల దృష్టిని ఆకర్షించింది ఏపీ ప్రభుత్వం ఇంటింటికి రేషన్ సరుకులు అందించే విషయంలో ఢిల్లీ సర్కారుకు దారి చూపారు. ఆప్ తాము అధికారంలోకి వస్తే ఇంటింటికీ రేషన్ సరుకులను ఇంటింటికి చేరవేస్తామని హామీ ఇచ్చింది. యువన్నీ ఒకెత్తు అయితే రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టె పారిశ్రామికవేత్తలు ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. దీనివల్ల వలసలు తగ్గుతాయని యువతకు స్థానికంగా ఉద్యోగాలు లభిస్తాయని, వలసలు తగ్గుతాయని భావిస్తోంది.

అయితే ఇలాంటి నిర్ణయాలు పారిశ్రామిక ప్రగతికి విఘాతం అని, ఇలా అయితే పెట్టుబడిదారులు రాష్ట్రానికి రారని కొందరు వ్యాఖ్యానించారు. ఆఖరుకు జాతీయ మీడియా కూడా అలాంటి కథనాలే ప్రసారం చేసింది.అయితే ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం మాత్రం జగన్ బాటలో నడిచేందుకు సిద్ధమైంది.

ముఖ్యమంత్రి యడ్యూరప్ప,పరిశ్రమల మంత్రి సురేష్ కుమార్ ఇటీవల ఓ ప్రకటన చేస్తూ స్ధానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా తాము నిబంధనలు విధిస్తామని, పారిశ్రామికవేత్తలు వాటిని అమలు చేసేలా చూస్తామని అన్నారు. అంటే ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఆ ప్రభుత్వం స్వాగతించడమే కాకుండా తాము కూడా అమలు చేస్తామని చెప్పడం ద్వారా జగన్ పాలనను మెచ్చుకున్నట్లు అయింది.