iDreamPost
android-app
ios-app

Koffee With Karan 7 అన్ హ్యాపీ మ్యారేజ్ కి మీరే కార‌ణం, స‌మంత కామెంట్స్

  • Published Jul 03, 2022 | 2:49 PM Updated Updated Jul 03, 2022 | 2:50 PM
  • Published Jul 03, 2022 | 2:49 PMUpdated Jul 03, 2022 | 2:50 PM
Koffee With Karan 7 అన్ హ్యాపీ మ్యారేజ్ కి మీరే కార‌ణం, స‌మంత కామెంట్స్

క‌ర‌ణ్ జోహార్ పై స్టార్ హీరోయిన్ సమంత సెటైర్ వేశారు. అన్ హ్యాపీ మేరేజీల‌కు మీరే కార‌ణ‌మ‌ని కాఫీ విత్ క‌ర‌ణ్ షో హోస్ట్ పై పెద్ద బండేశారు. తెర‌మీద చూసేదానికి, వాస్త‌వంగా అనుభ‌వించ‌డానికి మ‌ధ్య‌ చాలా తేడా ఉంటుంద‌ని సమంత చెప్పుకొచ్చారు. నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకున్న త‌ర్వాత, స‌మంత ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డంతో, సోష‌ల్ మీడియాలో హాట్ గా చ‌ర్చ న‌డుస్తోంది.

ఫేమ‌స్ సెల‌బ్రిటీ టాక్ షో కాఫీ విత్ క‌ర‌ణ్ ఏడో సీజ‌న్ (koffee with karan season 7)కి బిగ్ ఎట్రాక్ష‌న్ స‌మంతానే. ఈ షో 7వ సీజ‌న్ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్(Disney+Hotstar)లో త్వ‌ర‌లోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ మేర‌కు కాఫీ విత్ క‌ర‌ణ్ సీజ‌న్-7(Koffee With Karan 7) ప్రోమో రిలీజ్ అయ్యింది.

ఈ ఎపిసోడ్ లో స‌మంత డేరింగ్ గా మాట్లాడారు. కెరీర్ పై కామెంట్లు చేశారు. ఎన్నో వివాహ‌బంధాలు బాధాక‌రంగా ఉండ‌టానికి మీరే కార‌ణ‌మ‌న్న స‌మంత కామెంట్ కి , నేనేం చేశాన‌ని క‌ర‌ణ్ అడిగితే, పెళ్లంటే క‌బీకుషి క‌బీఘ‌మ్ లా ఉంటుంద‌ని మీరు చూపించారు. కాని, రియ‌ల్ గా కేజీఎఫ్ లా ఉంటుంద‌ని స‌మంత కామెంట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు చాలా ట్రెండ్ అయ్యింది. ఫుల్ వీడియో కోసం ఎదురుచూస్తున్న‌ట్లు ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు.


ఈ సీజ‌న్ లో హాట్ క‌పుల్స్, సూప‌ర్ స్టార్లు క‌నిపించ‌నున్నారు. క‌బీర్ సింగ్ జోడీ షాహిద్ క‌పూర్, కియారా, జుగ్ జుగ్ జియో మూవీ టీంతోపాటు లైగ‌ర్ హీరోహీరోయిన్లు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్యాపాండేల‌తోపాటు, అక్ష‌య్ కుమార్, శ్రీదేవి కూతురు జాన్వీక‌పూర్, సారా ఆలీఖాన్, అంద‌రూ ఎదురుచూసే స‌మంత‌, ట్ర‌యిల‌ర్లో అద‌ర‌గొట్టారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİ