P Krishna
తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైనప్పటి ప్రధాన పార్టీల్లో కొంతమంది అసంతృప్తి నేతలు పార్టీలు మారుతున్న విషయం తెలిసిందే.
తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైనప్పటి ప్రధాన పార్టీల్లో కొంతమంది అసంతృప్తి నేతలు పార్టీలు మారుతున్న విషయం తెలిసిందే.
P Krishna
తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. రాబోయే ఎన్నికల్లో గెలుపు కైవసం చేసుకోవడానికి అన్ని పార్టీలు శక్తి వంచన లేకుండా కష్టపడుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి బీ-ఫారాలు కూడా ఇచ్చింది. కాంగ్రెస్ 55 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. బీజేపీ ఆలస్యంగా నిన్న ఆదివారం 52 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ఖరారు చేసి విడుదల చేసింది. ఇక ఎన్నికల సందర్భంగా అసంతృప్తి నేతలు పార్టీలు వీడి వేరే పార్టీలోకి జంప్ అవుతున్నారు. తమ పార్టీ తమ పార్టీ వీడకుండా బుజ్జగింపుల పర్వం కొనసాగుతుంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత తాను పోటీ చేసే నియోజకవర్గంపై పుకార్లు రావడంతో క్లారిటీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ గురించిన కొన్ని పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొంత కాలంగా ఆయన నిజామాబాద్, జూబ్లిహిల్స్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. తాజాగా దీనిపై స్పందించిన మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ.. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందని ప్రత్యర్థి పార్టీలకు అర్థం అయ్యింది. ఈ నేపథ్యంలోనే తమ అభ్యర్థులపై లేని పోని పుకార్లు, అసత్య ప్రచారాలు చేస్తూ కన్ఫ్యూజన్ సృష్టిస్తున్నారు.
ఈసారి ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈసారి సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు ధీటుగా ఆ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారన్న విషయంపై చర్చలు సాగుతున్నాయి. బీజేపీ నుంచి నటి విజయశాంతి కామారెడ్డి నుంచి పోటీ చేస్తుందని అంటున్నారు.. ఇక కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారన్న విషయంపై క్లారిటీరాలేదు. తాజాగా తాను కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేస్తానని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రకటించారు.
గత కొన్నిరోజులుగా కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులపై రక రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సోమవారం నాడు కామారెడ్డిలో పర్యటించిన షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నిరోజులుగా తాను నిజామాబాద్, ఎల్లారెడ్డి, జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తున్నా అంటూ వస్తున్న ప్రచారంలో నిజం లేదని అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ఈ దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన మండి పడ్డారు. కామారెడ్డి నుంచి పోటీ చేస్తానని కేసీఆర్ ఎప్పుడు ప్రకటించాడో అప్పుడే తాను కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. తన పుట్టుక, చావు అంతా కామారెడ్డిలోనే అయి తేల్చి చెప్పారు. ప్రజా క్షేత్రంలో కేసీఆర్ తో తాడో పేడో తేల్చుకోబోతున్నామని అన్నారు.