iDreamPost
iDreamPost
భారతదేశాన్ని బ్రిటిష్ దాస్య సంకెళ్ళనుండి విముక్తి చేయడానికి అనేక మంది యువకులు విప్లవపంథాను ఎంచుకుని అనేక రహస్య విప్లవ సంస్థలను ఏర్పాటు చేశారు. ఈ విప్లవ పార్టీలు నడపటానికి తెల్లవాడి డబ్బును కొల్లగొట్టేవారు. వాటిని పార్టీ నిధులుగా ఉపయోగించి ఆయుధాల కొనుగోలుకి వాడేవారు. అలాంటి విప్లవ పార్టీల్లో హిందుస్తాన్ రిపబ్లికన్ ఆసోషియేషన్ ఒకటి. వీరి ఆధ్వర్యంలో చేసిన కకొరి రైలు దోపిడి, ఆ యాక్షన్ లో వారు చూపిన సాహసం భారత స్వంత్ర విప్లవ చరిత్రలో మైలురాయిగా చెప్పవచ్చు. ఈ రైలు దోపిడిలో ప్రముఖ విప్లవకారులు రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫకుల్లా ఖాన్ , ఠాకుర్ రోషన్ సింగ్, రాజేంద్ర లహరి, చంద్రశేఖర్ ఆజాద్, సచింద్ర నాధ్ బక్షి, కెషబ్ చక్రవర్థి, మన్మద నాధ్ గుప్త, మురారి లాల్ గుప్త, ముకుంది లాల్ గుప్త, భన్వరి లాల్ పాల్గొన్నారు.
Also Read: నిప్పుకణిక సర్దార్ భగత్ సింగ్
విప్లవ పార్టీ హెచ్.ఆర్.ఏ ఖజానాలో పుర్తిగా డబ్బు అయిపోవడంతో ముందుగా యూరప్ నావికుడు ద్వారా ఆర్డర్ ఇచ్చిన ఆయుధాలు వచ్చే సమయం ముంచుకు రావడంతో డబ్బు కోసం ప్రయత్నాలు చేసినప్పటికి ఎక్కడ నుండి సహకారం అందలేదు. దీంతో ఖజానా కోసం రైలు దోపిడి చేయాలి అనే పథకం మొదట రాంప్రసాద్ బిస్మిల్ పార్టీ ముందు పెట్టరు. ఒకసారి షాజహాన్ పూర్ నుండి లక్నో రైలులో వెళ్తూ ప్రతి స్టేషన్ లోను ప్రజల దగ్గర నుండి పన్ను ద్వారా వచ్చిన డబ్బుని వసూలు చేసి సంచులలో నింపి ప్రతి స్టేషన్ లోను రైలు రాగానే పోలీసు భద్రత మధ్యలో ఉన్న ఒక ఇనుప పెట్టెలో వేయటం అలాగే లక్నో దగ్గర కొద్దిగా భద్రతా లోపం గమనించి ఆ ప్రాంతంలో దోపిడి చేయవచ్చు అని భావించాడు. ఇదే విషయాన్ని పార్టీ ముందు పెట్టి రైలు దోపిడికి ముహూర్తం ఆగస్టు 9 న నిర్ణయించారు.
Also Read: వీర కిశోరం చంద్ర శేఖర్ ఆజాద్
ఆగస్టు 9 1925న షాజహన్ పుర్ నుండి లక్నో వస్తున్న నంబర్ 8 డౌన్ రైలుని, సాయంత్రం 7:00 దాటాక లక్నో దగ్గరలోని ఆలంనగర్, కకొరి అనే గ్రామల మధ్యకి వచ్చేసరికి అప్పటికే సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్ లో ఉన్న రాజేంద్ర లహరి , అస్ఫకుల్లా ఖాన్ చైన్ లాగి రైలుని ఆపివేశారు. ప్రయాణికులకి మేము విప్లవకారులం బందిపోటులం కాదు ,మీ ప్రాణాలకి , డబ్బు ,ఆభరణాలకి ఏమి హాని ఉండదు మేము ప్రభుత్వ సొమ్ముని మాత్రమే దోచుకొవటానికి వచ్చాము ఎవ్వరు కుర్చున్న చోటునుండి కదలకండి అని చెప్పి ప్రభుత్వ సొమ్ము ఉన్న భోగీ లోకి వెళ్లారు. అక్కడ కాపలా ఉన్న పొలీసులని బంధించి ఇనుప పెట్టెను పగలగొట్టి మొత్తం సొత్తు నాలుగు వేల అయిదువందల యాబై మూడు రూపాయల మూడు పైసల ఆరు అణాలు (4,553-3-6) ని దోచుకుని వెళ్తు అందరికన్న చిన్నవాడైన మన్మద్ నాద్ గుప్త తొందరపాటుతో రైలులో వేరే కంపార్ట్మెంట్ లో ఉన్న తన భార్యను చూసేందుకు వచ్చిన అహమద్ అలీ అనే న్యాయవాదిని తుపాకీతో కాల్చి చంపి అక్కడనుండి వెళ్ళిపొయారు.
Also Read: సమర నినాదం ఉధం సింగ్
ఒక నెల రొజులకి అష్ఫకుల్లా ఖాన్, ఆజాద్ తప్ప అందరు పట్టుబడ్డరు. ఒక సంవత్సరానికి మిత్రుని ద్రోహం వల్ల అష్ఫకుల్లా ఖాన్ దొరికిపొయాడు చివరిదాక దొరకనిది ఆజాద్ మాత్రమే. అరెస్టు అయిన వీరు జైలులో ఉండగా హక్కుల కోసం సుదీర్ఘ నిరాహారదీక్షలు చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి ముచ్చమటలు పట్టించారు. సుదీర్ఘ న్యాయ విచారన తరువాత రాంప్రసాద్ బిస్మిల్, అస్ఫకుల్లాఖాన్ , ఠాకుర్ రొషన్ సింగ్, రాజేంద్ర లహరికి ఉరి శిక్ష విధించి 1927 డిసెంబర్ 9న ఉరితీసారు — ఆ సమయంలో భగత్ సింగ్ కూడా ఈ విప్లవ సంస్థలో సభ్యుడే.