iDreamPost
android-app
ios-app

ఆచార్య హీరోయిన్ – డౌట్స్ క్లియర్

ఆచార్య హీరోయిన్ – డౌట్స్ క్లియర్

మెగాస్టార్ 152వ సినిమాగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య నుంచి త్రిష తప్పుకున్నాక ఏవేవో పేర్లు, ప్రచారాలు జరిగాయి. వాటికి చెక్ పెడుతూ కాజల్ అగర్వాల్ ఇవాళ ఆన్ లైన్ ఛాట్ లో క్లారిటి ఇచ్చేసింది. నెక్స్ట్ చేయబోయే తెలుగు సినిమాలు ఏంటని అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ చిరంజీవి సర్ తో ఆచార్య ఒప్పుకున్నానని ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్ ఆగిపోయింది కాబట్టి తిరిగి మొదలుకాగానే జాయిన్ అవుతానని సందేహాలకు చెక్ పెట్టింది.

నిజానికి కాజల్ పేరు కొద్దిరోజుల క్రితమే గట్టిగా వినిపించినప్పటికీ రెమ్యునరేషన్ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల నిర్ణయం వాయిదా పడిందనే టాక్ వచ్చింది. కానీ అదేమీ లేదన్న తరహాలో కాజల్ స్వయంగా చెప్పేసింది కాబట్టి ఇంకెలాంటి అనుమానాలు అక్కర్లేదు. చిరంజీవితో కాజల్ అగర్వాల్ కు ఇది రెండో సినిమా. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఖైదీ నెంబర్ 150 ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. అందులో జంట ఏమైనా తేడా కొడుతుందేమో అనుకుంటే మరీ ఎబ్బెట్టుగా అనిపించకపోవడంతో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పడింది.

సో ఇప్పుడు ఆచార్యలోనూ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కరోనా సృష్టించిన అనిశ్చితి వల్ల ఆగిపోయిన సినిమా షూటింగులు ఎప్పుడు తిరిగి మొదలవుతాయి చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఒకవేళ వాయిదా ఇంకా ఆలస్యమైతే ఆచార్య పెట్టుకున్న ఆగష్టు లేదా దసరా టార్గెట్ రీచ్ కావడం కష్టమే.అందులోనూ ఫ్లాష్ బ్యాక్ పాత్ర రామ్ చరణ్ చేస్తాడా చేయడా అనే విషయం తేలనే లేదు. ఏదైతేనేం హీరోయిన్ విషయంలో స్పష్టత వచ్చింది కాబట్టి ప్రస్తుతానికి మెగా ఫ్యాన్స్ హమ్మయ్య అనుకుంటున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet