Swetha
ఓటీటీలలో చాలా సినిమాలు వస్తున్నాయి.. అయితే ఆ సినిమాలలో కొన్ని నిజజీవితాలను ఆదర్శంగా తీసుకుని రూపొందించిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటి ఓ వెబ్ సిరీస్ తాజాగా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది.
ఓటీటీలలో చాలా సినిమాలు వస్తున్నాయి.. అయితే ఆ సినిమాలలో కొన్ని నిజజీవితాలను ఆదర్శంగా తీసుకుని రూపొందించిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటి ఓ వెబ్ సిరీస్ తాజాగా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది.
Swetha
నిజ జీవిత ఆధారాలను తీసుకుని.. వాటికీ అనుగుణంగా రూపొందించే సినిమాలకు, సిరీస్ లకు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఓటీటీ లలో ఈ జోనర్ కథలకు మంచి వ్యూవర్ షిప్ దక్కుతుంది. ఇప్పటివరకు ఇలాంటి ఎన్నో కథలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఓటీటీలలో నిత్యం ఎన్నో సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఆయా కథలను బట్టి వాటికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇక కొన్ని సినిమాలైతే ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమింగ్ అవుతూ ఉంటున్నాయి. అటువంటి సినిమాలకు కూడా వ్యూవర్ షిప్ బాగానే లభిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి ఆధారంగా తీసుకున్న “కైజర్” అనే ఓ కథ.. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం.
కైజర్ వెబ్ సిరీస్ ను .. యంగ్ డైరెక్టర్ వికాస్ చిక్బల్లాపూర్ తెరకెక్కించారు. కాగా, ఈ సిరీస్ కు సహచారి క్రియేషన్స్ బ్యానర్‌పై .. రోహన్ కులకర్ణి నిర్మించాగా.. తెలుగు ప్రేక్షకుల ముందుకు మాత్రం.. ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైన్మెంట్ డిస్ట్రీబ్యూటర్ ఓటీటీలోకి తీసుకొచ్చింది. ఈ సిరీస్ లో అంతా కొత్తవారు ఉన్నా కానీ.. కథ మాత్రం ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుందని చెప్పి తీరాలి. ఇక ఈ సిరీస్ ఒకేసారి రెండు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో విడుదల కావడం విశేషం. మార్చి 31 నుంచి ఈ సిరీస్.. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ , ఎమ్‌ఎక్స్ ప్లేయర్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. స్వయంగా మేకర్స్ ఈ విషయాన్నీ.. ఓ ప్రెస్ మీట్ లో తెలిపారు. ఈ సినిమా కథ అంతా కూడా.. ఆటో డ్రైవర్ల కష్టాలు ఎలా ఉంటాయి, వారిని ఆదుకోవడానికి హీరో ఎలాంటి పనులు చేస్తాడు అనే విషయంపైనే సాగుతుంది.
ఇక ఈ సినిమాకు సంబంధించి జరిగిని ప్రెస్ మీట్ లో.. డైరెక్టర్ వికాస్ మాట్లాడుతూ.. “ఈ కథను ప్రతీ ఆటో డ్రైవర్‌కు చేరవేయాలని దానికి మీడియా సపోర్ట్ కావాలి. కైజర్ చిత్రం రోహన్ కులకర్ణి రియల్ స్టోరీ. రోకు కాన్సెప్ట్ పైనా సినిమా తీయాలి అనే ఆలోచన వచ్చిన వెంటనే కథను సిద్దం చేసుకోవడం, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఇలా అన్ని పనులు చాలా తొందరగా అయిపోయాయి. సిరీస్‌లో చాలా మంది రియల్ ఆటో డ్రైవర్లను చూపించాము. డైలాగ్స్ రైటర్ ఫనీకి, సీనియర్ యాక్టర్లు కోటేశ్వరరావు, ప్రసాద్, హీరో రవి మహదాస్యమ్ దీనికి పనిచేసిన అందరికీ థ్యాంక్స్” అంటూ చెప్పుకొచ్చారు. మరి, కైజర్ వెబ్ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.