iDreamPost
android-app
ios-app

Kaikala Satyanarayana – క్రిటికల్ కండిషన్లో కైకాల.. హెల్త్ బులెటిన్ విడుదల చేసిన అపోలో

Kaikala Satyanarayana – క్రిటికల్ కండిషన్లో కైకాల.. హెల్త్ బులెటిన్ విడుదల చేసిన అపోలో

టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతతో బాధపడుతూ హైదరాబాదులోని అపోలో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. నిజానికి గత కొద్ది రోజుల క్రితమే ఆయన ఇంట్లో కాలు జారి పడిపోవడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు కుటుంబ సభ్యులు ఆయనను సికింద్రాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు.. అప్పుడు అక్కడ చికిత్సకు స్పందించడంతో ఆయన త్వరగానే కోలుకున్నారు కానీ ఈరోజు ఉదయం ఆయన తీవ్ర అస్వస్థతకు మరోసారి గురైనట్లు తెలుస్తోంది.

దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయనను హుటా హుటిన అపోలో ఆస్పత్రికి తరలించారు.. ఆయన హాస్పిటల్ కి వచ్చే సమయానికి తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న నేపథ్యంలో వెంటిలేటర్ మీదకు తరలించి చికిత్స ప్రారంభించారు అపోలో హాస్పిటల్ వైద్యులు. ఆయన ఈ ఉదయమే అపోలో హాస్పిటల్ లో జాయిన్ అయినా సరే ఆయన హెల్త్ బులిటెన్ కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. కైకాల ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉందని మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయి అని వెల్లడించారు. తాము అందిస్తున్న చికిత్సకు ఆశించిన మేర ఆయన శరీరం సహకరించడం లేదని, ఆయన స్పందించడం లేదని వైద్యులు వెల్లడించారు. నిజానికి ఆయన ఈ ఉదయమే అపోలో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు కానీ ఈ విషయాన్ని మాత్రం బయటకు రానివ్వ లేదు గతంలో కూడా వేరువేరు వ్యక్తులు చనిపోయినప్పుడు కైకాల సత్యనారాయణ చనిపోయారు అంటూ పెద్దఎత్తున ప్రచారం చేయడంతో కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్య విషయం మీద గోప్యత పాటిస్తున్నారు.

ఇప్పుడు అపోలో హాస్పిటల్ నుంచి అధికారికంగా హెల్త్ బులెటిన్ విడుదల కావడంతో ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు కైకాల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నారు. 1959వ సంవత్సరంలో సిపాయి కూతురు అనే సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన సుమారు 60 ఏళ్ల పాటు 777 సినిమాల్లో వివిధ రకాల పాత్రల్లో నటించారు. విలన్ గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక రకాల పాత్రల్లో మెప్పించిన ఆయన చివరిగా 2019 సంవత్సరంలో విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు, మహేష్ బాబు మహర్షి సినిమాలలో కనిపించారు. చాలా కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న కారణంగా ఆయన పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు.. ఆయన అనారోగ్యం విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆయన కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.