iDreamPost
android-app
ios-app

జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ అకాడమీ ఛైర్మన్ వికృత పర్వం.. పనిమనిషిపై!

ఆడ పిల్లలను పనికి అని పంపితే.. దొంగతనం నేరం మోపి.. కొట్టి హింసకు గురి చేస్తున్నారు యజమానులు. ఆర్థిక పరిస్థితులు బాగోక.. చదువులకు స్వస్థి చెప్పి.. పని పిల్లగా మారిపోయిన ఓ యువతి కన్నీటి గాధ ఇది. ఓ కామాంధుడు చేతిలో చిక్కి.. అతడి వికృత చేష్టలకు విలవిలలాడింది.

ఆడ పిల్లలను పనికి అని పంపితే.. దొంగతనం నేరం మోపి.. కొట్టి హింసకు గురి చేస్తున్నారు యజమానులు. ఆర్థిక పరిస్థితులు బాగోక.. చదువులకు స్వస్థి చెప్పి.. పని పిల్లగా మారిపోయిన ఓ యువతి కన్నీటి గాధ ఇది. ఓ కామాంధుడు చేతిలో చిక్కి.. అతడి వికృత చేష్టలకు విలవిలలాడింది.

జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ అకాడమీ ఛైర్మన్ వికృత పర్వం.. పనిమనిషిపై!

పొట్ట కూటి కోసం, ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేని కారణంగా కొంత మంది తల్లిదండ్రులు.. తమ ఆడ పిల్లల్ని పని మనుషులుగా మార్చేస్తున్నారు. కడుపు నిండా భోజనం అయినా దొరుకుతుందని భావించి.. పెద్ద పెద్ద ఇళ్లల్లో పనులకు పెడుతుంటారు. అయితే జీతం ఇస్తున్నాం కదా అని అడ్డమైన చాకిరీ చేయించుకుంటారు. రాచి రంపాన పెడుతుంటారు. అంతేనా యజమాని కామాంధుడు అయితే ఆడ పిల్ల బలికావాల్సిందే. ఏదైనా తేడా జరిగిందా వారిపై దొంగతనం నేరం మోపి, కొట్టి బయటకు పంపించేస్తుంటారు. ఇలానే జరిగింది ఆ యువతి విషయంలో. ఇంట్లో పనికి అని వెళితే.. తండ్రి వయస్సున్న యజమాని ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ నిజం బయటకు చెబితే.. చంపేస్తామని బెదిరించడంతో పాటు పోలీసు కేసు కూడా పెడతామని హెచ్చరించారు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. నిందితుడు ఓ పెద్ద స్కూల్లో అకాడమిక్ ఛైర్మన్. బంజారా హిల్స్ రోడ్డు నంబర్ 12 మిథులా నగర్‌లో నివాసం ఉంటున్నారు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ అకాడమిక్ ఛైర్మన్ మురళీ ముకుంద్. ఆ ఇంట్లో ఓ యువతి కొన్ని నెలలుగా పని చేస్తోంది. ఆమెపై కన్నేసిన మురళీ అవకాశం కోసం వేచి చూశాడు. జులై 16న ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో యువతిని బెడ్ షీట్ మడత పెట్టాలని చెప్పి తన బెడ్రూంకు పిలిచాడు. ఆమె గదిలోకి రాగానే స్నానం చేసి రావాలంటూ బలవంత పెట్టాడు. యజమాని అన్న భయంతో అతడు చెప్పినట్లే చేసింది. కాసేపు బయటకు వచ్చిన యువతిని ఫోటోలు, వీడియోలు తీశానంటూ బెదిరించాడు. ఆపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

అత్యాచారం జరిగిన విషయం ఎవ్వరికైనా చెబితే.. నీతో పాటు తల్లిని కూడా చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని మరుసటి రోజు మురళీ కుమారుడు ఆకాశ్‌కు చెప్పింది యువతి. అయితే తండ్రి చేసిన వికృత చేష్టలను కొడుకు వంత పాడాడు. చెప్పినందుకు ఆమెపై దాడి చేశాడు. ఇష్టమొచ్చినట్లు కొట్టారు. బయటకు వస్తే ఫిర్యాదు చేస్తుందన్న భయంతో చివరకు యువతిని ఇంట్లోనే ఉంచి హింసించారు. జులై 20వ తేదీన యువతిపై తప్పుడు ఫిర్యాదు చేశారు. యువతి సిమ్ దొంగిలించిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. యువతి తల్లికి మాత్రం డబ్బులు, నగలు చోరీ చేసిందంటూ కథ చెప్పింది మురళీ కుటుంబం. బాధితురాల్ని, ఆమె తల్లిని పోలీసు స్టేషన్‌కు పిలిపించారు. అయితే తనపై దొంగతనం నేరం మోపడంతో పాటు యజమాని బెదిరించడంతో తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పలేదు యువతి.

దొంగతనం చేయడంతో కొట్టామని చెబుతూ.. బాధితురాలి కుటుంబానికి లక్ష 70 వేల రూపాయలను ఇచ్చారు మురళీ. అంతే కాకుండా సిమ్ దొంగిలించినట్లు అంగీకరించినట్లు ఆమెతో వాయిస్ రికార్డు కూడా చేశారు మురళీ కుటుంబం. అయితే కూతురు ఇంటికి పరిమితం కావడంతో, భయం భయంగా బతకడంతో తల్లి ఆరా తీసింది. అప్పుడు యజమాని వికృత రూపం గురించి తల్లికి చెప్పి ఆవేదన చెందింది. అదేవిధంగా మురళీ కుమారుడు చేసిన దాష్టీకం గురించి చెప్పడంతో.. ఈ నెల 18న బంజారా హిల్స్ పోలీసులకు మురళీపై ఫిర్యాదు చేసింది తల్లి . కేసు నమోదు చేసిన పోలీసులు.. యువతిని భరోసా కేంద్రానికి తరలించారు. మురళీతో పాటు ఆయన కుమారుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.