iDreamPost
android-app
ios-app

EMK Jr NTR & Mahesh Babu : రాజమౌళి గురించి భయపెట్టిన తారక్

  • Published Dec 06, 2021 | 4:51 AM Updated Updated Dec 06, 2021 | 4:51 AM
EMK Jr NTR & Mahesh Babu : రాజమౌళి గురించి భయపెట్టిన తారక్

నిన్న రాత్రి జెమిని ఛానల్ లో వచ్చిన ఎవరు మీలో కోటీశ్వరులు స్పెషల్ క్లోజింగ్ ఎపిసోడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు రావడం టీవీ ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ప్రమోషన్లు గట్టిగా చేయడంతో ఇద్దరు హీరోల అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. దానికి తగ్గట్టే నిన్నటి భాగం మంచి ఎంటర్ టైనింగ్ గా సాగింది. అందులో కొన్ని చమక్కులు మెరుపులు కూడా పేలాయి. అన్నయ్యా అంటూనే మహేష్ ని తారక్ తీజ్ చేసిన విధానం బాగా వచ్చింది. ముఖ్యంగా రాజమౌళితో ప్రిన్స్ చేయబోయే సినిమా గురించి ప్రస్తావన ఇద్దరి మధ్యా వచ్చినప్పుడు జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో ఆల్రెడీ అయిపోవడం మొదలయ్యింది.

బాస్కెట్ బాల్ ఆటకు సంబంధించిన ప్రశ్న వచ్చినప్పుడు మహేష్ తనకు ఇష్టమైన క్రీడ క్రికెట్ అని చెప్పారు. అయితే ఇప్పుడు షూటింగుల వల్ల ఇప్పుడు ఆడటం కుదరటం లేదని అన్నాడు. ఇక్కడే యంగ్ టైగర్ కి దొరికిపోయారు. ఎలాగూ జక్కన్నతో నెక్స్ట్ మూవీ ఉంది కాబట్టి అక్కడ అన్ని రకాల ఆటలు ఆడిస్తారని చెప్పడంతో మహేష్ లో ఒకరకమైన సస్పెన్స్ తో కూడిన ఎక్స్ ప్రెషన్. అదేంటి అనగానే యంగ్ టైగర్ బదులిస్తూ అలా కాదు రాజమౌళితో సినిమా చేస్తున్నప్పుడు అన్ని గేమ్స్ ఉంటాయని చాలా ఛాలెంజింగ్ ఆ ఎక్స్ పీరియన్స్ ఉంటుందని నాలుగుసార్లు చేసిన అనుభవంతో చెబుతున్నానని అనడం కొసమెరుపు

మల్టీ స్టారర్ల ప్రస్తావన కూడా ఇద్దరి మధ్య ఎపిసోడ్ చివర్లో వచ్చింది. తాను కూడా ఆసక్తిగా ఉన్నానని ఈలోగా చరణ్ నువ్వు చేశారని మహేష్ చెప్పడం చూస్తే భవిష్యత్తులో ఇతర హీరోల కాంబినేషన్లో ప్రిన్స్ ని చూడొచ్చన్న నమ్మకం వచ్చింది. సితార పాప గురించి, చిన్నప్పుడు తను చేసిన సినిమాల గురించి ముచ్చటించిన మహేష్ కు ప్రశ్నలకు ఆన్సర్ చెప్పడం ద్వారా గట్టి నాలెడ్జ్ ఉందనే క్లారిటీ వచ్చేసింది. 25 లక్షలు గెలిచిన ప్రిన్స్ దాన్ని ఛారిటీకి ఇచ్చేశారు. సమాధానం చెప్పిన తర్వాత కూడా తారక్ పదే పదే రైటా అంటూ సాగదీయడం పట్ల మహేష్ ఇచ్చిన కౌంటర్లు నవ్వించాయి. మొత్తానికి మహేష్ తారక్ ల బాండింగ్ ని జనం ఎంజాయ్ చేశారు

Also Read : Thaman : శుక్రమహర్దశ అనుభవిస్తున్న సంగీత దర్శకుడు