iDreamPost
iDreamPost
IPL 2022లో ఎవ్వరూ ఊహించని విధంగా గుజరాత్ టైటాన్స్ గెలిచి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ IPL లో ఇంగ్లాండ్ కి చెందిన జోస్ బట్లర్ అత్యధిక రన్స్ సాధించి 17 మ్యాచ్‌ల్లో 863 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచి సరికొత్త రికార్డు సాధించాడు. దీంతో అత్యధిక పరుగులు సాధించిన వారికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్ ని కైవసం చేసుకున్నాడు. రాజస్తాన్ రాయల్స్‌కు బట్లర్ బ్యాటింగే ప్రధాన బలం. తన బ్యాటింగ్ తో ఎన్నో సార్లు రాజస్థాన్ కి విజయం అందించాడు. ఇక బట్లర్ పరుగులతోనే కాదు తన ఆటతో ప్రైజ్‌మనీ అందుకోవడంలో కూడా చరిత్ర సృష్టించాడు.
#ఈ సీజన్లో రాజస్థాన్ బట్లర్‌ను 10 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఇది కాకుండా ఈ సీజన్ మొత్తంలో ఏకంగా 37 అవార్డులు అందుకున్న బట్లర్ వాటి ద్వారా 95 లక్షల ప్రైజ్‌మనీ అందుకొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
#IPL 15వ సీజన్ అవార్డుల్లో ఆరెంజ్ క్యాప్, మోస్ట్ వాల్యుబుల్, గేమ్ చేంజర్, మ్యాగ్జిమమ్ ఫోర్స్, మ్యాగ్జిమమ్ సిక్సెస్, పవర్ ప్లేయర్ పురస్కారాలతో 60 లక్షల రూపాయలు గెలుచుకున్నాడు.
#లీగ్ స్టేజ్‌లో రెండుసార్లు, క్వాలిఫయర్–2లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న బట్లర్ వీటి ద్వారా 7లక్షల రూపాయలు సాధించాడు.
#వివిధ మ్యాచ్‌ల్లో పవర్ ప్లేయర్, గేమ్ చేంజర్, మోస్ట్ ఫోర్స్, మోస్ట్ సిక్సెస్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, సూపర్ స్ట్రైకర్ అవార్డులతో మరో 28 లక్షలు అందుకున్నాడు.
#మొత్తంగా ఆక్షన్ ద్వారా కాకుండా జోస్ బట్లర్ తన ఆటతో దాదాపు 95 లక్షల రూపాయలను సంపాదించాడు.