iDreamPost
android-app
ios-app

రాజస్థాన్‌ రాయల్స్‌కు సంగక్కర గుడ్‌బై! కొత్త హెడ్‌ కోచ్‌గా ద్రవిడ్‌?

  • Published Aug 10, 2024 | 12:48 PM Updated Updated Aug 10, 2024 | 12:48 PM

Kumar Sangakkara, Rajasthan Royals, Rahul Dravid, IPL 2025: ఐపీఎల్‌లోని ఓ టీమ్‌కు హెడ్‌ కోచ్‌గా ఉన్న దిగ్గజ మాజీ క్రికెటర్‌ రాజీనామా చేస్తాడనే వార్తలు వస్తున్నాయి. మరి ఆ హెడ్‌ కోచ్‌ ఎవరు? ఎందుకు రాజీనామా చేస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Kumar Sangakkara, Rajasthan Royals, Rahul Dravid, IPL 2025: ఐపీఎల్‌లోని ఓ టీమ్‌కు హెడ్‌ కోచ్‌గా ఉన్న దిగ్గజ మాజీ క్రికెటర్‌ రాజీనామా చేస్తాడనే వార్తలు వస్తున్నాయి. మరి ఆ హెడ్‌ కోచ్‌ ఎవరు? ఎందుకు రాజీనామా చేస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Aug 10, 2024 | 12:48 PMUpdated Aug 10, 2024 | 12:48 PM
రాజస్థాన్‌ రాయల్స్‌కు సంగక్కర గుడ్‌బై! కొత్త హెడ్‌ కోచ్‌గా ద్రవిడ్‌?

ఐపీఎల్‌ 2025కి ఇంకా చాలా టైమ్‌ ఉన్నా.. అన్ని ఫ్రాంచైజ్‌లు మార్పులు చేర్పులపై దృష్టి సారించాయి. రాబోయే సీజన్‌కి ముందు మెగా వేలం ఉన్న విషయం తెలిసిందే. ఆ వేలానికంటే ముందే.. కోచింగ్‌ విభాగం, సపోర్టింగ్‌ స్టాఫ్‌లో మార్పులు చేసుకుంటున్నాయి ఫ్రాంచైజీలు. ఈ క్రమంలోనే రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు హెడ్‌ కోచ్‌ కూడా మారనున్నాడు. గత మూడేళ్లుగా రాజస్థాన్‌ రాయల్స్‌కు హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న శ్రీలంక దిగ్గజ మాజీ క్రికెటర్‌ కుమార సంగక్కర.. రాజస్థాన్‌ రాయల్స్‌కు వీడ్కోలు చెప్పనున్నట్లు సమాచారం.

సంగక్కరకు ఇంగ్లండ్‌ వైడ్‌ బాల్‌ కోచ్‌ పదవీ ఆఫర్‌ రావడంతో.. రాజస్థాన్‌ రాయల్స్‌కు గుడ్‌బై చెప్పి ఇంగ్లండ్‌ టీమ్‌ హెడ్‌ కోచ్‌గా వెళ్లాలని సంగక్కర భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. దీనికి రాజస్థాన్‌ రాయల్స్‌ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఎందుకంటే.. మేనేజ్‌మెంట్‌ సైతం హెడ్‌ కోచ్‌ మార్చాలనే ఆలోచనలో ఉంది. ఎందుకంటే.. అప్పుడెప్పుడో 2008 ఆరంభ సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన రాయల్స్‌ జట్టు.. మళ్లీ ఐపీఎల్‌ కప్పును ముద్దాడలేదు. అందుకే ఐపీఎల్‌ 2025 సీజన్‌లో కప్పు కొట్టాలన కసితో ఉంది రాజస్థాన్‌ మేనేజ్‌మెంట్‌. ఆ టార్గెట్‌ను అందుకోవాలంటే కోచ్‌ను మార్చాలని భావిస్తోంది.

Goodbye Sangakkara to Rajasthan Royals

ఇటీవలె ముగిసిన టీ20 వరల్డ్‌ కప్‌ 2024తో టీమిండియా హెడ్‌ కోచ్‌గా తన పదవీ కాలం ముగించుకున్న రాహుల్‌ ద్రవిడ్‌ను.. తమ కొత్త హెడ్‌ కోచ్‌గా తీసుకోవాలని రాజస్థాన్‌ రాయల్స్‌ భావిస్తోంది. అందుకోసం ఇప్పటికే ద్రవిడ్‌కు కూడా ఈ విషయం స్పందించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ 2021 సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గా అపాయింట్‌ అయిన సంగక్కర.. ఆ తర్వాత కోచ్‌ అయ్యాడు. ఐపీఎల్‌ 2024 సీజన్‌లో 3వ స్థానం, ఐపీఎల్‌ 2023లో 5వ స్థానం, ఐపీఎల్‌ 2022లో రన్నరప్‌గా నిలిచింది ఆర్‌ఆర్‌. మరి రాజస్థాన్‌ రాయల్స్‌ కోచ్‌గా సంగక్కర స్థానంలో ద్రవిడ్‌ వస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.