iDreamPost
android-app
ios-app

హెడ్‌ కోచ్‌గా రెండో సారి బాధ్యతలు చేపట్టనున్న రాహుల్‌ ద్రవిడ్‌?

  • Published Jul 23, 2024 | 12:10 PMUpdated Jul 23, 2024 | 12:10 PM

Rahul Dravid, Head Coach, IPL 2025: హెడ్‌ కోచ్‌గా టీమిండియాకు టీ20 వరల్డ్‌ కప్‌ అందించి.. తన ప్రస్థానం ముగించిన ద్రవిడ్‌ మరోసారి.. హెడ్‌ కోచ్‌గానే మరో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టనున్నాడు. ఈ అంశం గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Rahul Dravid, Head Coach, IPL 2025: హెడ్‌ కోచ్‌గా టీమిండియాకు టీ20 వరల్డ్‌ కప్‌ అందించి.. తన ప్రస్థానం ముగించిన ద్రవిడ్‌ మరోసారి.. హెడ్‌ కోచ్‌గానే మరో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టనున్నాడు. ఈ అంశం గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jul 23, 2024 | 12:10 PMUpdated Jul 23, 2024 | 12:10 PM
హెడ్‌ కోచ్‌గా రెండో సారి బాధ్యతలు చేపట్టనున్న రాహుల్‌ ద్రవిడ్‌?

భారత్‌కు టీ20 వరల్డ్‌ కప్‌ 2024 అందించి.. టీమిండియా హెడ్‌ కోచ్‌గా తన ప్రయాణం ముగించిన దిగ్గజ మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరోసారి అదే రోల్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఐపీఎల్‌ ఆరంభ విజేత రాజస్థాన్‌ రాయల్స్‌ తమ హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ను మరోసారి నియమించుకునేందుకు అతన్ని సంప్రదించినట్లు సమాచారం. గతంలో కూడా ద్రవిడ్‌ రాజస్థాన్‌కు మెంటర్‌గా పనిచేశాడు. అతని మెంటర్‌షిప్‌లోనే రాజస్థాన్‌ ఒక కన్సిస్టెంట్‌ టీమ్‌గా మారింది. జట్టులో యంగ్‌ టాలెంట్‌ను అద్భుతంగా ప్రొత్సహించిన ద్రవిడ్‌.. తన మాస్టర్‌ మైండ్‌తో రాజస్థాన్‌ను ఒక స్ట్రాంగ్‌ టీమ్‌మా తయారుచేశాడు.

2014-2015 ఐపీఎల్‌ సీజన్స్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ మెంటర్‌గా పనిచేసిన ద్రవిడ్‌.. అంతకంటే ముందు ఆ జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. అయితే.. ప్రస్తుతం టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవీకాలం ముగియడంతో.. ఖాళీగానే ఉన్న ద్రవిడ్‌ను వేరే టీమ్‌ తీసుకోకముందే.. తమ టీమ్‌లోకి తీసుకోవాలని రాజస్థాన్‌ రాయల్స్‌ మేనేజ్‌మెంట్‌ బలంగా ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. అలాగే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ కూడా ద్రవిడ్‌ను తమ మెంటర్‌గా తీసుకోవాలనే ప్లాన్‌లో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

Dravid

కాగా.. 2021 చివర్లో టీమిండియా హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌ ద్రవిడ్‌.. తన కోచింగ్‌లో టీమిండియాను నెక్ట్స్‌ లెవెల్‌కు తీసుకెళ్లాడు. ద్రవిడ్‌ కోచ్‌గా ఉన్న కాలంలో.. టీమిండియా 2022 టీ20 వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనల్‌ ఆడింది. ఆలాగే 2023లో ఆసియా కప్‌ గెలిచింది. అదే ఏడాది డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడింది. వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ వరకు ఓటమి ఎరుగని జట్టుగా దూసుకెళ్లింది. కానీ, ఫైనల్లో ఆసీస్‌ చేతిలో ఓటమితో చరిత్రకు అడుగుదూరంలో నిలిచిపోయింది. కానీ, అది జరిగిన ఆరునెలల తర్వాత టీ20 వరల్డ్‌ కప్‌ 2024 సాధించి.. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇలా ద్రవిడ్‌ కోచింగ్‌లో టీమిండియా సూపర్‌ స్ట్రాంగ్‌గా ఉంది. అదే టెంపోను కొనసాగిస్తాడనే ఉద్దేశంతో రాజస్థాన్‌ రాయల్స్‌ ద్రవిడ్‌ కోసం ప్రయత్నాలు చేస్తోంది. మరి ద్రవిడ్‌ ఆర్‌ఆర్‌ టీమ్‌లోకి వెళ్తే ఎలాంటి ఫలితాలు వస్తాయని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి