iDreamPost
android-app
ios-app

హేంమత్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు

  • Published Dec 25, 2019 | 6:47 AM Updated Updated Dec 25, 2019 | 6:47 AM
  • Published Dec 25, 2019 | 6:47 AMUpdated Dec 25, 2019 | 6:47 AM
హేంమత్‌ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు

జార్ఖండ్‌లో 44 ఏళ్ల యువకుడు సీఎం పీఠం అధిరోహించబోతున్నారు. జార్ఖండ్‌ ముక్తి మోర్చా కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్‌ సోరెన్‌ సీఎంగా బాధ్యతుల చేపట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 29 మధ్యాహ్నం సీఎంగా హేమంత్‌ సోరెన్‌ పదవీ ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు కూటమిలోని కాంగ్రెస్, ఆర్‌జేడీ నేతలతో కలసి సోరెన్‌ ఆ రాష్ట్ర గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ అవకాశం ఇవ్వడంతో ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు.

కాగా, తాజాగా వెలువడి జార్ఖండ్‌ శాసన సభ ఎన్నికల్లో జార్ఖండ్‌ ముక్తి మోర్చా, కాంగ్రెస్, ఆర్‌జేడీ కూటమికి 47 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. 81 స్థానాలున్న జార్ఖండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 41 సీట్లు అవసరం. కూటమి గెలిచిన 47 సీట్లలో జార్ఖండ్‌ ముక్తి మోర్చాకు 30, కాంగ్రెస్‌కు 16, ఆర్‌జేడీ ఒక సీట్లు వచ్చాయి. ఇక ఒంటరిగా పోటీ చేసిన బీజేపీకి 25 సీట్లు గెలుచుకుని ప్రతిపక్ష హోదాలో నిలిచింది.

ఎన్నికల పొత్తు కుదిరన సమయంలోనే కూటమి అభ్యర్థిగా హేమంత్‌ సోరెన్‌ను కూటమి పార్టీలు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా గెలుపుతో హేమంత్‌ సోరెన్‌ రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.

Jojobet GirişjojobetJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet