iDreamPost
android-app
ios-app

JDU MLA Dance Video Viral : రికార్డింగ్ డ్యాన్స్ లో మహిళతో ఎమ్మెల్యే చిందులు..సీఎం సీరియస్

  • Published May 16, 2022 | 5:10 PM Updated Updated May 16, 2022 | 5:11 PM
JDU MLA Dance Video Viral : రికార్డింగ్ డ్యాన్స్ లో మహిళతో ఎమ్మెల్యే చిందులు..సీఎం సీరియస్

Bihar : ప్రజా ప్రతినిధులంటే హుందాగా ఉండాలి. కాస్త సరదాగా ఉన్నా ఫరవాలేదు. కానీ నలుగురిలో స్టేజీలెక్కి పిచ్చి గంతులు వేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఓచోట పెళ్లికి వెళ్లిన ఓ ఎమ్మెల్యేగారు..స్టేజీపై ఓ డ్యాన్సర్ డ్యాన్స్ వేస్తుంటే చూసి ఆగలేకపోయారు. అంతే నేను కూడా నీతో కలిసి చిందులేస్తా అంటూ స్టేజీ ఎక్కేశాడు. ఆయనగారి వేసిన చిందుల్ని చూసి సీఎం పిచ్చ క్లాసు పీకారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే..అంటే.

బీహార్ లోని భాగల్ పూర్ నియోజకవర్గం నంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గోపాల్ మండల్ ఇటీవల తన నియోజకవర్గంలో జరిగిన వివాహానికి వెళ్లారు. వెళ్లి ఊరికే ఉన్నారా అంటే అహా..తెగ రెచ్చిపోయారు. వివాహ వేడుకలో ఏర్పాటు చేసిన రికార్డింగ్ డ్యాన్స్ ల్లో పాల్గొని ఓ డ్యాన్సర్ తో కలిసి చిందులేశారు.

పెళ్లిలో ఏర్పాటు చేసిన రికార్డింగ్ డ్యాన్సులో ఓ అమ్మాయి డ్యాన్స్ వేస్తోంది. ఇంతలో ఎమ్మెల్యే గోపాల్ మండల్ లో ఉత్సాహం పొంగుకొచ్చేసింది. అంతే తన కళలన్నీ చూపించేశారు. కాసేపటికి ఎమ్మెల్యే పక్కన కూర్చున్న పెద్దమనుషులు కూడా లేచి డ్యాన్స్ చేయటంప్రారంభించారు. ఇదంతా పెళ్లికి వచ్చిన వాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈవీడియో తెగ వైరల్ అయ్యి చివరకు జేడీయూ అధిష్టానం దృష్టికి , సీఎం కూడా చూసే స్ధాయికి వెళ్లింది. దీంతో పార్టీ హై కమాండ్ సీరియస్ అయ్యింది. ఏంటా చిందులు అంటూ క్లాస్ పీకారు.

సీఎం నితీష్ కుమార్ ఎమ్మెల్యేను పిలిచి చివాట్లు పెట్టారు. అంత బహిరంగంగా ఆ డ్యాన్సులేమిటి…. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు హుందాగా ఉండాలని మందలించారు. దానికి ఆ ఎమ్మెల్యే …. సార్ నేను పాటలు వినగానే కంట్రోల్ చేసుకోలేక పోయానని చెప్పినట్లుగా సమాచారం.