iDreamPost
android-app
ios-app

డైలీ వర్కవుట్ రొటీన్‌, తాను ఎందుకు స్ట్రిక్ట్ డైట్‌లో ఉన్నానో బైట‌పెట్టిన జాన్వీ కపూర్

డైలీ వర్కవుట్ రొటీన్‌, తాను ఎందుకు స్ట్రిక్ట్ డైట్‌లో ఉన్నానో బైట‌పెట్టిన జాన్వీ కపూర్

అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ తనకంటూ సొంత గుర్తింపును తెచ్చుకుంది. తాజాగా గుడ్ లక్ జెర్రీ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించేందుకు ముందుకొచ్చిన జాన్వీ, ఈ సందర్భంగా తన డైట్, వర్కవుట్స్ ముచ్చట్లు చెప్పుకొచ్చింది.

జాన్వీ నటించిన గుడ్ లక్ జెర్రీ సినిమా నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైంది. ఓటీటీ వేదికగా వచ్చిన ఈ సినిమా వాస్తవానికి తమిళ సినిమా రీమేక్. నయనతార నటించిన కోకోకోకిల సినిమాకు ఇది రీమేక్. జాన్వీ కపూర్ కు ఇది ఐదో సినిమా. తన నటనతో అందరి ప్రశంసలు అందుకుంటోంది. అయితే కేవలం సినిమాలోని పాత్రలే కాకుండా ప్రమోషన్లు, జిమ్ వీడియోల్లోని గ్లామర్ తో జాన్వీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సాధారణంగా ఏ ఈవెంట్ కు వెళ్ళాలన్నా 50 నిమిషాల్లో రెడీ అయిపోతుందట జాన్వీ. సోషల్ మీడియాలో తనపై, తన వస్త్రధారణపై వచ్చే కామెంట్స్ ను అస్సలు పట్టించుకోదట జాన్వీ. తన ఫిట్నెస్ రహస్యాలను సైతం చెప్పేసింది. తాను ఎక్కువ శాతం యోగా చేస్తానని, జిమ్ లో వర్కౌట్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని వివరించింది.

అంతే కాదు.. తాను స్ట్రిక్ట్ గా డైటింగ్ సైతం చేస్తున్నట్లు తెలిపింది జాన్వీ. 2 నెలలుగా జంక్ ఫుడ్ కు దూరంగా డైటింగ్ లో ఉన్నట్లు పేర్కొంది. అయితే ఈ డైటింగ్ తన తదుపరి చిత్రం మిస్టర్ అండ్ మిస్సెస్ మహీ కోసమని చెప్పింది. ఈ సినిమాలో క్రికెటర్ పాత్రను పోషిస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుందట.

Jojobet GirişMadridbetMadridbetbetciomatbet girişgrandpashabetDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren Sitelerdeneme bonusugrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet