iDreamPost
android-app
ios-app

పింఛన్‌దారులకు జగన్‌ సర్కార్‌ తీపి కబురు

పింఛన్‌దారులకు జగన్‌ సర్కార్‌ తీపి కబురు

ఆంధ్రప్రదేశ్‌లో సామాజికSపింఛన్‌దారులకు జగన్‌ సర్కార్‌ తీపి కబురు చెప్పింది. ఇటీవల జరిగిన నవశకం సర్వేతో సంబంధం లేకుండా పాత జాబితా ప్రకారమే లబ్ధిదారులకు ఫించన్‌ మంజూరు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్‌ నవశకం సర్వే, ఆధార్‌తో అనుసంధానమైన ఆస్తుల వివరాల ఆధారంగా లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వం ప్రక్షాళన చేసిన విషయం తెలిసిందే.

గతంలో ఐదెకరాల లోపు భూమి ఉన్న వారికే పింఛన్‌ లభింస్తుండగా ఆ పరిమితిని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పదేకరాలకు పెంచింది. అంతేకాకుండా వయస్సును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించింది. ఈ రెండు నిర్ణయాలతో దాదాపు ఆరేడు లక్షల మంది పింఛన్‌ పొందేందుకు అర్హత సాధించారు.

నవశకం సర్వేతోపాటు పింఛన్‌కు ఆధార్‌ నంబర్‌ అనుసంధానం చేయడంతో కొంత మందికి ఎక్కువ భూమి ఉన్నట్లు తెలింది. భూమి వారిదైనా వారి వారసులు అనుభంలో ఉంది. అయితే దాన్ని వారసులకు రిజిస్ట్రేషన్‌ చేయకపోవడంతో భూమి వృద్ధుల పేరుతోనే ఉండడంతో కొంత మంది పింఛన్లు రద్దయ్యాయి. దీంతోపాటు భూముల ఆన్‌లైన్‌ వివరాల నమోదులో చోటుచేసుకున్న తప్పులతో రెండెకరాలు ఉన్న వారికి 12 ఎకరాల భూమి ఉన్నట్లు మీ భూమిలో చూపిస్తోంది. ఇలాంటి తప్పిదాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో పింఛన్‌ లబ్ధిదారులు అనర్హులుగా తేలారు. వీటిపై ఆయా గ్రామాల్లో వృద్ధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా, స్పందించిన ప్రభుత్వం తప్పులను సవరించే వరకు పాత విధానంలోనే పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది.