జనతా కర్ఫ్యూ – నిర్మానుష్యంగా మారిన తెలుగు రాష్ట్రాలు

  • Published - 05:03 AM, Sun - 22 March 20
జనతా కర్ఫ్యూ – నిర్మానుష్యంగా మారిన తెలుగు రాష్ట్రాలు

ప్రధాని నరేంద్రమోడీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ దేశమంతటా కొనసాగుతుంది. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రధాని మోడీ ప్రజలంతా జనతా కర్ఫ్యూలో స్వచ్చందంగా పాల్గొంటున్నారు.

తెలుగు రాష్ట్రాల ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూని పాటించడంతో పట్టణాలు,నగరాల వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. వైద్యం, మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల, అగ్నిమాపక శాఖ, ఆసుపత్రులు, పాలు, పండ్లు, కూరగాయలు, పెట్రోలు బంకులు, మీడియా సిబ్బందికి కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దులను మూసివేశారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ బంకులు కూడా మూసివేశారు. తెలంగాణ సరిహద్దుల్లో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ స్వచ్చందంగా జనతా కర్ఫ్యూ దేశవ్యాప్తంగా కొనసాగనుంది. తెలంగాణలో మాత్రం మరుసటి రోజు ఉదయం వరకూ కర్ఫ్యూ కొనసాగనుంది.

ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 315 మందికి కరోనా సోకినట్లు నిర్దారించగా నలుగురు మృతి చెందడంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన ఆంక్షలు విధిస్తున్నాయి.

Show comments