iDreamPost
android-app
ios-app

జనసేన వ్యవస్థాపకుల్లో ఒకరైన రవితేజ పార్టీకి గుడ్ బై

జనసేన వ్యవస్థాపకుల్లో ఒకరైన రవితేజ పార్టీకి గుడ్ బై

జనసేన పార్టీకీ కోలుకోలేని దెబ్బ తగిలింది. పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ మిత్రుడు అయిన రాజు రవితేజ జనసేన పార్టీకి రాజీనామా చేసారు. అయన రాజీనామాను ఆమోదిస్తునట్టు జనసేన కూడా అధికారిక ట్విట్టర్ వేదికగా స్పందించింది.

“జనసేన పార్టీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీ రాజు రవితేజ గారు పార్టీ పదవికి చేసిన రాజీనామాను ఆమోదించాం. ఆయన పార్టీ పట్ల వ్యక్తం చేసిన ఆవేదనను, అభిప్రాయాలను గౌరవిస్తున్నాము. గతంలో కూడా అయన ఇటువంటి బాధతోనే పార్టీని వీడి తిరిగి పార్టీలోకి వచ్చారు. ఆయనకు మంచి భవిష్యత్తు, ఆయన కుటుంబానికి శుభం కలుగ చేయాలని ఆ జగన్మాతను ప్రార్టిస్తున్నాను.” అంటూ పేర్కొంది.

రవితేజ జనసేన పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు.. జనసేన పార్టీ కార్యకర్తలకు సుపరిచతమైన వ్యక్తి.. జనసేన ప్రారంభించడానికి రాజు రవితేజే ప్రేరణ ఇచ్చారని స్వయంగా పవన్ కల్యాణ్ పలు సందర్భాల్లో చెప్పారు. పార్టీ స్థాపించినప్పటినుంచీ ఆయన పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారు.ఎక్కువగా తెర వెనక కనిపించే రాజు రవితేజ జనసేన పార్టీ స్థాపించే సమయంలో పవన్‌కు విలువైన సలహాలు, సూచనలిచ్చారు.