iDreamPost
android-app
ios-app

75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో దక్కని వాటిని రెండేళ్లలో సామాన్యులకు అందించిన జగన్

75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో దక్కని వాటిని రెండేళ్లలో సామాన్యులకు అందించిన జగన్

ఈరోజు యావత్ భారతదేశం మొత్తం 75 సంవత్సరాల స్వతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకుంటుంది. పేరుకు ఇది ప్రజాస్వామ్యం అయినప్పటికీ అంతర్లీనంగా పెట్టుబడిదారీ స్వామ్యం కొనసాగుతూ ఉండటాన్ని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్వతంత్ర భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు నేరుగా ప్రజలకు చేరిన దాఖలాలు లేవు.

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం మొదలు బ్యాంకు ద్వారా అందిస్తున్న సబ్సిడీ లోన్స్ వంటివి ఎన్నో పథకాలు ప్రభుత్వం దగ్గర నుండి సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళేసరికి ఎంతోకొంత చేతులు మారే చేరుతుంది. ఇది అందరికీ తెలిసిన సత్యమే. కాలం మారుతున్న కొద్దీ పాలనలో పారదర్శకత పెరిగింది. అయినప్పటికీ సామాన్య ప్రజలకు చేరుతున్న సంక్షేమ పథకాల విషయంలో మాత్రం చిల్లులు కనిపిస్తూనే ఉన్నాయి.

కానీ 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి మాత్రం ప్రభుత్వానికి – ప్రజలకు మధ్య సంక్షేమ పథకాల విషయంలో ఎటువంటి దళారులను ప్రోత్సహించలేదు. చివరకు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ప్రజా ప్రతినిధులు కూడా లేకుండా చేయడం గొప్ప సాహసమని చెప్పాలి.

రాజకీయ పార్టీలకు వర్గాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తుంది.ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 
ప్రతి సంక్షేమ పథకాన్ని నేరుగా ప్రజలకే చేరవేయడంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది.అమ్మవడి ద్వారా 15000 పిల్లల తల్లులు అకౌంట్ కు చేరుతుంది. ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ వంటి విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు వసతి దీవెన, విద్యా దీవెన పేరుతో నేరుగా వారి తల్లుల అకౌంట్ లోకి డబ్బులు జమ అవుతుంది.నేతన్నలకు 24 వేల రూపాయలు నేరుగా వారి అకౌంట్ కు చేరుతుంది.

అలాగే ఆటోడ్రైవర్లకు , టైలర్ , బ్రాహ్మణులకులకు నాయీ బ్రాహ్మణులకు చిరు వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరికి 10 వేల రూపాయల చొప్పున వారి అకౌంట్లో జమ చేస్తుంది ప్రభుత్వం.రైతు భరోసా డబ్బులు కూడా నేరుగా రైతు అకౌంట్ లోకి చేరుతుంది.

ఇక వృద్ధులు, వితంతు,ఒంటరి మహిళలకు ఇస్తున్న పెన్షన్ నెల వారి చేతుల్లో పెడుతోంది.రైతులకు వడ్డీ లేని రుణాలు , పంటలకు బీమా,అగ్రవర్ణాల పేద మహిళలకు ఈబిసి నేస్తం ద్వారా 15 వేల రూపాయలు,మత్స్యకార భరోసా పథకం ద్వారా 10వేల రూపాయలు .వైఎస్సార్‌ చేయూత ద్వారా లబ్ధి పొందే మహిళలకు ఏడాదికి రూ.18,750 .

ఇలా ప్రభుత్వం అందిస్తున్న ప్రతి రూపాయి నేరుగా ప్రజల ఖాతాలోకి చేరటం దేశంలోనే ఇది ప్రథమం.

75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వాలు మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజల చెంతకు చేరే సరికి సగానికి సగం వివిధ అధికారుల చేతుల్లో జారిపోయేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబం సరాసరి ఒక వార్షిక సంవత్సరానికి సుమారు 50,000 ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు లబ్ది పొందింది. ఇన్ని సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఈ విధంగా ప్రజా సంక్షేమ పథకాలను ప్రభుత్వం నేరుగా ప్రజల ఖాతాలో జమ చేయడం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికే సాధ్యమైందనే విషయం సామాన్య ప్రజలలో వినిపిస్తుంది.