iDreamPost
iDreamPost
రాజకీయ పార్టీలు సోషల్ ఇంజినీరింగ్ అనే అంశాన్ని కేవలం ఓట్లకోసమే ఇంతకాలం వాడుకుంటూ వచ్చాయి. అంబేద్కర్ రాజ్యాంగంలో వెనుకబడిన, అణగారిన కులాలకు రిజర్వేషన్లు కల్పించినా వాటి లక్ష్యం నెరవేర్చేందుకు ఇన్నేళ్ళలో ఏ రాజకీయ పార్టీ చిత్తశుద్ధితో పనిచేయలేదు. ఈ వర్గాల అభ్యున్నతికి పాటుపడని రాజకీయ పార్టీలు వారిని కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటూ వచ్చాయి . రాజకీయంగా వారి ఎదుగుదలకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. రిజర్వుడు స్థానాల్లో ఆయా వర్గాలవారు ఎన్నికైనా అధికారం మాత్రం ఆధిపత్య కులాలు తమ చెప్పుచేతల్లోనే ఉంచుకున్నాయి. అందుకే స్వాతంత్య్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు అవుతున్నా ఈ వర్గాల్లో అభివృద్ధి ఆశించినమేర జరగలేదు.
ఎస్సి, ఎస్టీ, బీసీ కులాల్లో అనేక ఉపకులాల ప్రజలకు ఇంకా రాజకీయ ప్రాతినిథ్యం లభించలేదు. ఈ దేశంలో ఇన్నేళ్ళ స్వాతంత్య్ర ప్రజాస్వామ్యంలో ఖద్దరు చొక్కా తొడగని కులాలు ఇప్పటికీ అనేకం ఉన్నాయి. ఇది ఎంతో దురదృష్టం అయినా కరెక్షన్ ఎక్కడో ఒక చోట మొదలు కావాల్సి ఉంది. ఎవరో ఒకరు కరెక్షన్ చేయాల్సి ఉంది. అటువంటి కరెక్షన్ ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికలతో మొదలయినట్టు కనిపిస్తోంది.అందుకు సాక్ష్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో టిక్కెట్ల పంపిణీ నుండి, ఎన్నికల తర్వాత అధికార పంపిణీ వరకూ ఈ సోషల్ ఇంజినీరింగ్ లో కరెక్షన్ కొంత ఆశాజనకంగానే కనిపిస్తోంది. మంత్రివర్గంలో స్థానం కల్పించడంతో మొదలయిన సోషల్ ఇంజినీరింగ్ కరెక్షన్ అనేక స్థాయిల్లో జరుగుతోంది.
రాష్ట్రంలో ఈ వెనుకబడిన, అణగారిన కులాలకు ఉమ్మడిగా ఉండే ఆర్ధిక కార్పొరేషన్లను విస్తరించి ప్రతి కులానికి లేదా ఉపకులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం స్వాగతించవలసిన పరిణామం. ఈ కార్పొరేషన్ల వల్ల రాష్ట్ర ఖజానాపై ఆర్ధిక భారం పడుతుంది అనో లేక డబ్బులు లేనప్పుడు ఎన్ని కార్పొరేషన్లు ఉంటే ఏంటి అనో విమర్శించవచ్చు. కానీ ఈ కార్పొరేషన్ల ఏర్పాటు వల్ల, వాటిలో డైరెక్టర్ గానో చైర్మన్ గానో నియమించడం వల్ల స్వాతంత్య్రం వచ్చిన 75 యేళ్ళకు చాలా కులాలకు మొదటిసారిగా రాజకీయ ప్రాతినిథ్యం లభించింది. ఖద్దరు చొక్కా మొదటిసారిగా వచ్చిన కులాల ప్రతినిధులు అనేకమంది ఉన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారిలో ఎంతమంది రాష్ట్రంలో కీలకమైన పదవుల్లోకి వస్తారో చూడాల్సి ఉంది. మొదట అయితే వారికి జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని ఆయా కులాల వారు ఎంతమేరకు ఉపయోగించుకుంటారో ప్రజాస్వామ్య, స్వాతంత్య్ర ఫలాలు ఎంతమేరకు అనుభవించగలుగుతారో భవిష్యత్తు చూపిస్తుంది.
Also Read : వీర్రాజు ఇంత వేగంగా మారిపోయారేమీ..?
ఇక ఈ కరెక్షన్ ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసినట్టు కనిపిస్తోంది. రిజర్వేషన్ ద్వారా ఎన్నికల్లో రాజకీయ ప్రాతినిథ్యం పొందిన అనేక కులాల వారు ఇంతకు ముందులా నామమాత్రపు ప్రాతినిథ్యం వహించడం కాకుండా వారు తమ పదవుల్లో అస్సెర్టివ్ గా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుర్చీ పాలకవర్గ నేతలకు ఇచ్చి తాము ఆ పక్కనే ఏ బెంచీమీదో, చిన్న కుర్చీలోనో లేక నేలమీదనో కూర్చునే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. ఇప్పుడు వారి కుర్చీలో వారే కూర్చుంటున్నారు. వారు తీసుకోవాల్సిన నిర్ణయాలు వారే తీసుకుంటున్నారు.
ఈ ఫోటో చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి చేసిన సోషల్ ఇంజినీరింగ్ కరెక్షన్ ప్రతిఫలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక మున్సిపాలిటీకో, జిల్లాపరిషత్ లేక మండల పరిషత్ కార్యాలయానికో మంత్రి వస్తే సదరు మున్సిపల్ చైర్మన్ లేదా జిల్లా పరిషత్ చైర్మన్ లేదా మండల పరిషత్ అధ్యక్షుడు తన కుర్చీ మంత్రిగారికి ఇచ్చి తాను పక్కన కూర్చోవడం ఇంతకాలం చూస్తూ వస్తున్నాం. కానీ ఈ ఫోటోలో పరిస్థితి భిన్నంగా ఉంది.
ఇటీవల జరిగిన నంద్యాల మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీ మున్సిపల్ స్థానాన్ని కైవసం చేసుకోగా జనరల్ కోటాలోని చైర్మన్ స్థానానికి తీవ్ర పోటీ నెలకొంది . స్వయంగా స్థానిక ఎమ్మెల్యే తన భార్య శిల్పా నాగిని రెడ్డిని చైర్మన్ గా చేయాలని తలచినా ముఖ్యమంత్రి జగన్ సూచన మేరకు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన యువతి షేక్ మాబున్నిసాను చైర్మన్ అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది .
నాటి నుండి విధుల నిర్వహణలో చిత్తశుద్ధితో , దృఢ సంకల్పంతో వ్యవహరిస్తోంది అన్న పేరు తెచ్చుకొంటూ మున్సిపాలిటీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది . ఇటీవల
కర్నూల్ జిల్లాకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం, జిల్లా ఇన్ ఛార్జి మంత్రి అనిల్ కుమార్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం వంటి వారంతా తన కార్యాలయానికి వచ్చిన వేళ మంత్రులకు తమ అధికార స్థానాలు ఇచ్చి పక్కన కూర్చొనే స్థానిక నాయకుల తీరుకు భిన్నంగా తనకు అధికారికంగా బాధ్యతాయుతంగా సంక్రమించిన చైర్మైన్ స్థానంలో స్థిరంగా కూర్చొని వచ్చిన మంత్రులను , ఎమ్మెల్యేలకు అతిథి స్థానాలు కేటాయించి మున్సిపాలిటీలో జరుగుతున్న కార్యక్రమాలు , అవసరమైన నిధులు , కావాల్సిన ప్రభుత్వ సహకారం వంటివి చర్చించడం చూస్తే సోషల్ ఇంజినీరింగ్ కరెక్షన్ పరంగా జగన్ గొప్ప విజయం సాధించినట్లే . ఈ చర్యలను పార్టీలకు అతీతంగా స్వాగతించాల్సిందే.
Also Read : వలంటీర్లు వేస్ట్ అన్నారు..మీరెందుకు పెడుతున్నారు బాబు?