Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ నుంచి అసోంకు చేపల ఎగుమతికి గల అడ్డంకులను తొలగించాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసోం ముఖ్యమంత్రి శరబానంద సోనోవాల్‌కు ఫోన్ చేశారు.లాక్ డౌన్ సమయములో ఏపీ ఆక్వా ఉత్పత్తుల రవాణాకు ఎదురవుతున్న అడ్డంకుల తొలగింపుపై దృష్టిపెట్టాలని జగన్ విజ్ఞప్తి చేశారు.ఏపీ నుంచి భారీగా ఆక్వా ఉత్పత్తులు అసోంకు ఎగుమతి అవుతున్న సంగతిని సోనోవాల్‌కు జగన్ గుర్తు చేశారు.
అసోం సరిహద్దులలో ఆక్వా ఉత్పత్తులతో వచ్చిన ఆంధ్రప్రదేశ్ లారీలను నిలిపి వేయకుండా రాష్ట్రంలోకి అనుమతించాలని సీఎం జగన్ కోరారు.దీంతోపాటు చేపలను విక్రయించే మార్కెట్లను కూడా తెరిచి ఉంచాలని జగన్ విజ్ఞప్తి చేశారు.దీనికి సానుకూలంగా స్పందించిన అసోం ముఖ్యమంత్రి ఈ విషయంపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేస్తానని భరోసా ఇచ్చారు.
లాక్‌డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో చిక్కుకుపోయిన అసోం వాసులకు ఆహార, వసతులు కల్పించాలని జగన్‌ను అసోం సీఎం సోనోవాల్ కోరారు. ఇందుకు జగన్ స్పందిస్తూ అసోం వాసులకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేసి అండగా ఉంటామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.