iDreamPost
android-app
ios-app

జగన్ ఒక స్ఫూర్తి

  • Published Dec 21, 2019 | 10:48 AM Updated Updated Dec 21, 2019 | 10:48 AM
జగన్ ఒక స్ఫూర్తి

గ‌ర్విస్తున్నాం

శ‌త్రువు ఇంటికి వ‌చ్చారు
ఆతిథ్యం మార‌దు
స్నేహితుడు ప్రాణాపాయాన ఉన్నారు
అస‌లు వెనుకంజ వేసే ప్ర‌స‌క్తే లేదు
అమ్మ, చెల్లాయి, జీవ‌న స‌హ‌చ‌రి
ఇలా క‌ష్ట‌కాలంలో నిలిచిన మాతృమూర్తుల
దీవెన‌లే త‌నకు అండ‌నిచ్చాయి..ఆత్మ‌స్థైర్యాన్నిచ్చి
ఇంత‌టి వాడినిచేశాయి..ఆయ‌నే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి..
డిసెంబ‌ర్ 21 – పుట్టిన రోజు సంద‌ర్భంగా అందిస్తున్న కథ‌నం ఇది

నాన్న మాట ఇచ్చారు..ఎంద‌రి జీవితాల‌నో తీర్చిదిద్దారు..నాన్న ప‌త్రిక పెట్టారు..ఎంద‌రికో నీడ నిచ్చారు..నాన్న కొన్ని ప‌థ‌కాలు అ మ‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని, ఉమ్మ‌డి ఆంధ్ర రాష్ట్ర పాల‌కునిగా పేరు తెచ్చుకున్నారు..నాన్న మాట త‌ప్ప‌లేదు.. నాన్న మ డం తిప్ప‌లేదు..నాన్న ఎంద‌రినో ఎదుర్కొన్నారు..నాన్న గొప్ప శ‌క్తిని ఇచ్చి ఈ లోకం విడిచి పోయారు.. నాన్న ఇచ్చిన బ‌లం.. ఓ కుటుంబం.. నాన్న ఇచ్చిన బ‌లం ప్ర‌జా దీవెన..నాన్న ఇచ్చిన బ‌లం ఓ ఆరోగ్య శ్రీ ల‌బ్ధిదారు..నాన్న ఇచ్చిన బ‌లం ఆ రోజు వేదిక పై నాన్న‌తో దీవెన అందుకున్న చిన్నారి..ఆ ఫీజు రీ యింబ‌ర్స్ మెంట్ పొందిన పేద విద్యార్థిని.. డాక్ట‌ర్ చ‌దువు చ‌దువుకోవాల‌న్న క ల నెరవేరిన సంద‌ర్భం..ఇవ‌న్నీ నాన్న బ‌లాలు..నాన్న పెంచి, ప‌దిల పరిచిన మూలాలు..నాన్న దిగంతం..నాన్న అనంతం.. అ లాంటి నాన్న ఇచ్చిన దారి..నాన్న ఇచ్చిన గొప్ప సంక‌ల్పం ఇవ‌న్నీ ఆ కుర్రాడిని ఇటుగా న‌డిపాయి. క‌ష్ట కాలంలో సాంత్వ‌న ఇ చ్చాయి.. ఫ‌లితం ఇవాళ ఆయ‌న ఈ న‌వ్యాంధ్ర‌కు ముఖ్య‌మంత్రి.. న‌మ్మిన వారంద‌రికీ పెన్నిధి.

ఎవరెవ‌రో ఏవో మాట్లాడేరు
అస్స‌లు ఆయ‌న‌కు ఆ ఛాన్స్ ఇవ్వ‌నే లేదు
కొన్ని గ్ర‌హ‌కూటములు క‌లిసి ఆయ‌న జాత‌కం మార్చేస్తాం అని
బీరాలు ప‌లికాయి..ఆఖ‌రికి త‌మ‌ను కాద‌న్న కాల రేఖ‌లు చూసి విస్తుబోయాయి

ఈ సారి ఎదురుగా ఒక ప్ర‌ముఖ ఛానెల్ ప్ర‌తినిధి..ఏవేవో అడుగుతున్నారు.. ఏవేవో ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు..హేతువుకు అవి తూగ‌డం లేదు..ఆయ‌న‌కు అవి న‌చ్చడం లేదు..గ‌డిచిన కొన్నేళ్లుగా ఆ రాజ‌కీయ శ‌క్తిని ఆ ఛానెల్ ప్రోత్స‌హిస్తోంది. ఆ రాజ‌కీయ శ క్తిని న‌మ్ముకునే పాత్రికేయ విలువ‌ల‌ను సైతం తాక‌ట్టు పెట్టి స్వీయ ప్ర‌యోజ‌న సిద్ధికి త‌హ‌త‌హ‌లాడుతోంది..ఆయ‌న పాద‌యాత్ర ముగిసిపోనుంది..కొద్ది సేప‌ట్లో..అయినా ఆయ‌న‌పై కొన్ని అస్త్రాలు సంధిస్తున్నారు..ఆ ఛానెల్ ప్ర‌తినిధి..ఒక ప్ర‌భంజనం ముందు వ చ్చే ఆటుపోటూ ఇది..ఇలాంటివి ఆ యువ నాయ‌కుడు ఎన్నో చూశాడు.. న‌వ్వుకున్నాడు.. ఈ సారి త‌న వంతు.. త‌న బాధ్య‌త ను వినిపించేలా గొంతు పెంచారు.. త‌న‌దైన వాగ్ధాటిని వినిపించి తానేంటో నిరూపించుకున్నారు.

తుఫానులు కొన్ని
గాలులు గాయాలు చేస్తే
ఊర‌టనిచ్చే ధ‌ర్మం త‌న‌దే
అలాంటి రాజ‌కీయ తుఫానులు
ఉప్పెన‌ల‌ను ఎన్నింటినో ఎదుర్కొన్నారు
స‌డ‌ల‌ని సంక‌లాన్ని వ‌రించి ఈ వేళ విజేతగా నిలిచారు
చ‌రిత్ర‌ను పున‌ర్లిఖించారు..ఆ పేజీల‌లో నిండిన సంతోషాల సంత‌కం తానే..అయ్యారు..

నా గొంతు వినిపించే అవ‌కాశం ఇవ్వండి..నా వారి బాధ‌ను తెలుసుకునే అవ‌కాశం ఇవ్వండి..ఇవ‌న్నీ మ‌రిచిపోయి మీరు మాట్లా డుతున్నారు. నా తండ్రి లానే నేను.. మాట ఇచ్చాను…త‌ప్ప‌ను..వేద‌న పూరిత స్వ‌రాల‌కు కాస్త అండ‌గా ఉండ‌డం బాధ్యత‌..బాధ్య త మ‌రిచిపోయి ఓట్లు అడ‌గ‌డం కుద‌ర‌ని ప‌ని..మీరు బాధ్య‌త‌లు మ‌రిచి, రాజ‌కీయం చేయ‌మ‌న్నా చేస్తామ‌న్నా ఒప్పుకునేదే లే దు. మొన్న‌టి వేళ ఒక అనైతిక‌త విచ్చుక‌త్తిలా దూసుకువ‌స్తూ ఉంటే న‌వ్వి ఊరుకున్నారు.. త‌ప్పుకుని కొత్త యుద్ధం ఒక‌టి చే యాల‌ని చెప్పేరు..చేశారు..ఆ విజ‌యం ఆ ఫ‌లం ఇప్పుడు ఆయ‌న‌ను ఈ న‌వ్యాంధ్ర‌కు ప‌గ్గాలు అందుకునేలా చేసింది. వైఎస్ వార సునికి ఇంతటి ఛ‌రిష్మా ఎలా?

విష‌య ప్రాధాన్యం అన్న‌ది ముఖ్యం
అప్రాధాన్య‌త‌ను స‌మీక‌రించి మాట్లాడ‌డం కాదు..
అలాంటి స‌మ‌ర్థ‌త ఉన్ననాడు యంత్రాంగంలో
కొత్త ఉత్సాహం నింప‌డం సులువు శత్రుమూక‌ల‌ను నిలువ‌రించ‌డం ఇంకా సులువు

తెల్ల‌వారు జామున నాలుగు గంట‌ల‌కే లేవాలి..ఇవాళ సెష‌న్ ఉంది..విష‌య నిపుణులు వ‌చ్చి కొన్నింటిని చ‌ర్చిస్తారు. త‌న సందే హ నివృత్తి చేస్తారు..ఇదీ ఆ కుర్రాడి ప‌ట్టుద‌ల..శాస‌న స‌భ వాకిట చంద్ర‌బాబు స‌హా చాలా మందిని ఎదుర్కోవాలి..చాలా అంశాలపై, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై గొంతెత్తాలి.. ఎదురుగా ఉన్న‌ది మామూలు వ్య‌క్తి కాదు..న‌ల‌భై ఏళ్ల చ‌రిత్ర ఉన్న నేత.. అస‌లు నా పొలిమే రల్లో నిల‌బ‌డ‌డం, మాట్లాడ‌డం అంటే ఎంత తెగువ ఉండాలి అని అనుకునే వ్య‌క్తి..అయినా ఆ కుర్రాడు అదిరిపోలేదు..బెదిరి పోలేదు.. మాట్లాడాడు..మైక్ క‌ట్ చేసిన ప్ర‌తిసారీ కూడా త‌న వేద‌నేంటో చెప్పుకున్నాడు..అప్ప‌టికీ విన‌ని,వినిపించుకోని స్పీక‌ర్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ప్ర‌జాక్షేత్రాన అడుగిడి మూడు వేల కిలోమీట‌ర్ల‌కు పైగా న‌డిచాడు. త‌న గొంతు బ‌లీయంగా వినిపించి, ప్రజా మద్దతు కూడ‌గ‌ట్టాడు..నాడు పాద‌యాత్ర‌లో ఎన్నో హామీలు వాటిని ముఖ్య‌మంత్రి అయ్యాక విజ‌య దుందుభి మోగించాక నెరవేర్చేందుకు నిరంత‌రం ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నాడు..

మాధ్య‌మ స్ర‌వంతిలో ఏవేవో వ‌స్తాయి
సొంత బ‌లం బ‌ల‌గం ఉన్న రాజ‌కీయ శ‌క్తుల‌కు
మాట్లాడించ‌డం సులువు.. విష‌యాన్ని నాట‌కీక‌రించ‌డం ఇంకా సులువు
కానీ ఇవి కాదు కదా కావాల్సింది.. స్ప‌ష్ట‌త ముఖ్యం.. నిబ‌ద్ధ‌త అను సూత్రం పాటింపు ఇంకా/ఇంకా ముఖ్యం

ఇప్పుడు ఉద‌యం నాలుగు గంట‌ల నుంచి రాత్రి 11 గంట‌ల 30 నిమిషాల వ‌ర‌కూ మాట్లాడుతూనే ఉన్నారు..ఎవ‌రో ఒక‌రికి ఏవో
ఆదేశాలు చెబుతూనే ఉన్నారు.. దాస‌న్న, క‌ళావ‌తి లాంటి నాయ‌కులు ఆయ‌న వెన్నంటి న‌డిచారు.. కాల గ‌తిలో ధ‌ర్మాన ప్ర‌సాద రావు, కిల్లి కృపారాణి వంటి కీల‌క నేత‌ల బాస‌టగా నిలిచారు. ఇప్పుడు ఆయ‌న మ‌రింతగా జ‌నంలోకి చొచ్చుకుపోయారు. సొంత మాధ్య‌మాలు ఆ రోజు ఇన్ని లేవు.. రాస్తున్న వారంతా ఒక రాజ‌కీయ శ‌క్తికి అనుయాయులు.. అయినా త‌న గొంతుక వినిపించా రు..ఇవాళ న‌మ్ముకున్న వారంద‌రికీ నేనున్నా అన్న భ‌రోసానే కాదు ప‌ద‌వులు ఇచ్చి, ప్రాధాన్యం ఇచ్చి తానేంటో మ‌రో మారు ని రూపించుకున్నారు..ఇప్పుడు అమ్మ విజ‌య‌మ్మ ఎంతో ఆనందిస్తున్నారు..చెల్లాయి, జీవ‌న స‌హ‌చ‌రి ఇలా ఈ ముగ్గురూ ఆయ న కోసం ఎంతో శ్ర‌మించారు..స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి లాంటి కీల‌క నాయ‌కులు, సుబ్బారెడ్డి సాయిరెడ్డి లాంటి వ్యూహ‌క‌ర్త‌లు ఆయ‌న వె న్నంటే న‌డిచారు.. ఆయ‌న న‌మ్మ‌కాన్ని మ‌రింత పెంచారు.. ఇవాళ ఆయ‌నను చూసి ఈ రాష్ట్రం గ‌ర్విస్తోంది.. పాల‌న‌లో వ‌స్తు న్న కీల‌క మార్పులు చూసి ఈ న‌వ్యాంధ్ర న‌మ్మ‌కాలు రెట్టింపు అవుతున్నాయి..ఇప్పుడు మాట్లాడ‌డం కాదు చేత‌ల‌తో ప‌రుగులు తీ యించ‌డం అన్న ప్ర‌ధానోద్దేశంతో ఆయ‌న క‌నెక్ట్ టు ఏపీ అంటున్నారు.. బ‌డుల గ‌తి మారుస్తానంటున్నారు..కొత్త చ‌దువుల‌కు శ్రీ కారం దిద్దుతానంటున్నారు..నేత‌న్న‌ల నేస్తం తానే అని రేప‌టి వేళ కొత్త ప‌థ‌కానికి శ్రీ‌కారం దిద్ది 84 వేల కుటుంబాల్లో ఆనందం నిం పనున్నారు. ఇలాంటి ఆనందాల వేళ మీకు అభినంద‌న‌లు చెబుతూ..హ్యాపీ బ‌ర్త్ డే జ‌గ‌న్..

రంగుల దారాలు మీతో అనుబంధాల‌ను పంచుకుంటాయి
సంబంధిత జీవితాలు మీరు చేసిన మేలును ప‌దే ప‌దే స్మ‌రిస్తాయి
నాన్న ఈ పొందూరు ఖాదీని చూసి మురిసిపోయారు..ఈ నేల‌ను చూసి పొంగిపోయారు
అలాంటి నాన్న‌ను జ్ఞ‌ప్తికి తెస్తూ..సుప‌రిపాల‌న అందిస్తూ..కార్య‌దీక్ష‌కూ..ద‌క్ష‌త‌కూ..ప్రాధాన్యం ఇస్తూ..
నేత‌న్న నేస్త‌మా..వందేళ్లూ వ‌ర్థిల్లు అన్న‌ది వారి దీవెన..అందుకో..