iDreamPost
android-app
ios-app

సామాజిక న్యాయం.. జ‌గ‌న్ కే సాధ్యం

సామాజిక న్యాయం.. జ‌గ‌న్ కే సాధ్యం

వైఎస్. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌దేళ్ల క్రిత‌మే పార్టీ స్థాపించారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో ఏపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్ప‌టికీ మొత్తం దేశంలో మొత్తం ఒంటరిగా అధిక ఓట్ల శాతం సాధించిన పార్టీగా నిలిచింది. అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకున్న మొదటి పది పార్టీల్లో స్థానం దక్కించుకుంది. సీమాంధ్రలో మొత్తం పోలయిన ఓట్లలో 44.4% సాధించింది. స్వల్ప తేడాతో ఓడి పోయినప్పటికీ కూడా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం ప్రజా ఉద్యమాలు చేపట్టి ప్రజలకు బాగా చేరువైంది. ఫ‌లితంగా ఆ త‌ర్వాతి ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించింది. రెండేళ్ల క్రితం ముఖ్య‌మంత్రి అయ్యారు. ఓ సారి ప్ర‌తిప‌క్షం, రెండేళ్ల కింద‌టే అధికార ప‌క్షంలో ఉన్న జ‌గ‌న్.. అవ‌లంబిస్తున్న విధానాలు సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న నేత‌లు సైతం ఆశ్చ‌ర్య‌పోయేలా ఉంటున్నాయి. ప్ర‌శంస‌లు పొందుతున్నాయి.

సామాజిక న్యాయం పేరుతో స్థాపించిన పార్టీలకు మించి జ‌గ‌న్ పాల‌న‌లో సామాజిక న్యాయం అందుతోంద‌ని క‌చ్చితంగా చెప్పొచ్చు. అన్ని రంగాల్లోనూ సామాజిక న్యాయం పాటించేలా ఏపీ సీఎం ఘ‌న‌నీయంగా కృషి చేస్తున్నారు. పాల‌న‌లోను, పార్టీలో కూడా అంద‌రికీ స‌మ న్యాయం అందిస్తున్నారు. అన్నింటా ఆయ‌న‌కు అదెలా సాధ్య‌మ‌వుతోంది..? అని అనుభ‌వం ఉన్న నేత‌ల‌ను సైతం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీలో కూడా జ‌గ‌న్ అందే పంథా పాటించారు. తాజాగా డిప్యూటీ మేయర్లు, డిప్యూటీ చైర్మ‌న్ల ఎన్నిక‌ల్లోనూ సామాజిక న్యాయం పాటించారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం జగన్‌ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నారు. డిప్యూటీ మేయర్ల ఎన్నికల్లోనూ ఆయ‌న అనుస‌రించిన విధానం ఆలోచింప‌చేస్తోంది. రెండో డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్ల ఎంపికలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అగ్రస్థానం వేసింది. 85 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు రెండో డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నికల్లో 56 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ అవకాశం ఇచ్చారు. బీసీలు 24 మందికి, ఎస్సీలు 22 మందికి, ఓసీలు 37, ఎస్టీలు ఇద్దరికి అవకాశం ఇచ్చారు. అన్ని వర్గాలు, కులాలకు వైఎస్‌ జగన్‌ ప్రాధాన్యం ఇచ్చారు.

కాగా, మేయర్‌,మున్సిపల్‌ చైర్‌పర్సన్ల పదవుల్లోనూ సామాజిక న్యాయానికి, మహిళా సాధికారతకు వైఎస్సార్‌సీపీ పెద్దపీట వేసి సరికొత్త చరిత్రను లిఖించిన సంగతి తెలిసిందే. చర్రితలో తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ వర్గాలకు 78 శాతం పదవులు లభించాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ నామినేటెడ్‌ పదవుల్లో కూడా బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు అగ్రాసనం వేశారు. మహిళలకు సమున్నత స్థానం కల్పించారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఏకంగా 58 శాతం నామినేటెడ్‌ పదవులు ఇచ్చారు. మహిళలకు ఏకంగా 50.40 శాతం పదవులు దక్కాయి. చ‌క్క‌టి పాల‌న అందించేందుకు అనుభ‌వం అవ‌స‌రం లేద‌ని, స‌రైన ఆలోచ‌నా విధానం ఉంటే చాల‌ని జ‌గ‌న్ నిరూపిస్తున్నార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.