iDreamPost
iDreamPost
కృష్ణానదికి వరదలు వస్తే చాలు వణికిపోతున్న విజయవాడ వాసులకు ఊరట లభిస్తోంది. ముఖ్యంగా కృష్ణాతీరంలోని కరకట్ట ప్రాంతాలకు ఉపశమనం దక్కుతోంది. జగన్ ప్రభుత్వం చొరవ చూపడంతో రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తిచేసేందుకు ముహూర్తం సిద్ధమయ్యింది. స్వయంగా జగన్ జగన్ దానికి పునాది వేయబోతున్నారు. దాంతో కృష్ణలంక , రాణీగారితోట, రామలింగేశ్వర నగర్ సహా పలు ప్రాంతాలకు వరద ముప్పు బెడద తీరుతున్నట్టునేనని అంతా భావిస్తున్నారు. దశాబ్దాల నాడు పూర్తి చేయాల్సిన పనిని, గత ప్రభుత్వాలు పెండింగ్ లో పెట్టగా ప్రస్తుతం జగన్ దానిని పూర్తి చేసే విజయవాడను వరద ముప్పు నుంచి తప్పించే ప్రయత్నానికి పూనుకోవడంతో పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రకాశం బ్యారేజ్ లో పూడిక తీత పనులకు కూడా ప్రభుత్వం పూనుకుంటోంది. దానికి అనుగుణంగా కాంట్రాక్ట్ కేటాయించింది. డ్రెడ్జింగ్ పనులకు శ్రీకారం చుడుతోంది. తద్వారా భవానీపురం ప్రాంత వాసులకు కూడా వరద సమస్య కొద్ది మేరకు తగ్గుతుందని భావిస్తున్నారు. బ్యారేజీలు నీటి నిల్వలు పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దానికి దిగువన కృష్ణానదీ తీరం వెంబడి రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం గతంలో వైఎస్సార్ ప్రభుత్వం బీజం వేసింది. అయితే ఆ అడ్డుగోడ నిర్మాణం సగం మాత్రమే పూర్తి చేసి తర్వాత ప్రభుత్వాలు చేతులు దులుపుకున్నాయి. ఆ కాలంలో నదికి పెద్దగా వరదలు కనిపించకపోవడంతో అటువైపు దృష్టి సారించలేదు.
గడిచిన రెండేళ్లుగా కృష్ణానదికి వరదలు వచ్చాయి. పదేళ్ల తర్వాత పెద్ద వరదలు రావడంతో విజయవాడ వాసులు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. దానిని గుర్తించిన ప్రభుత్వం రిటైనింగ్ వాల్ పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. వరదల సమయంలో బాధితులకు దగ్గరకు వెళ్లిన నేతలు ఇచ్చిన హామీ అమలుకు పూనుకుంది. నిధులు కేటాయించి పనులకు శ్రీకారం చుడుతోంది. సీఎం చేతుల మీదుగా పనులు ప్రారంభించబోతున్నారు. దాంతో విజయవాడ తూర్పు నియోజకవర్గం ప్రజలకు పెద్ద ఉపశమనం అవుతుందని స్థానికులు చెబుతున్నారు. జగన్ గతంలో తాను ఇచ్చిన హామీని అమలు చేసి విజయవాడ ను వరద ముప్పు నుంచి గట్టెక్కిస్తున్నందుకు పలువరు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.