iDreamPost
android-app
ios-app

జగన్ స్పీడ్ ,యాక్టివ్ అయిన ఎమ్మెల్యే లు..

జగన్ స్పీడ్ ,యాక్టివ్ అయిన ఎమ్మెల్యే లు..

ఎమ్మెల్యే గారు ఎక్కడ…? ఇవాళ పలానా గ్రామానికి వెళ్ళారు, ఇంచార్జ్ ఎక్కడ…? ఆ వార్డులో ఏదో కార్యక్రమానికి వెళ్ళారు…. ఏపీలో ఇప్పుడు వినపడుతున్న మాటలు ఇవి. రెండు రోజుల క్రితం కేబినేట్ సమావేశం సందర్భంగా సిఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు, మంత్రులు గ్రౌండ్ లెవెల్ కు వెళ్లాలని, ఎన్నికల కోసం సిద్దం కావాలని జగన్ ఆదేశించడం, అలాగే ప్రశాంత్ కిషోర్ టీం రంగంలోకి దిగుతుంది అనే ప్రచారం వైసీపీ ఎమ్మెల్యేలను యాక్టివ్ చేసింది.

జగన్ ను చూసుకుని ధైర్యంగా ఉన్న గుండెల్లో ఇప్పుడు ఉత్సాహం పుట్టుకొచ్చింది.ఏం జరిగినా ఆయనే చూసుకుంటారు లే అనుకున్నారో ఏమో గాని కొందరు సైలెంట్ గా ఉన్నారు. మీడియాను ముందుకు పెద్దగా వెళ్ళలేదు, సోషల్ మీడియాలో అభిమానుల పోస్ట్ లే గాని ఎక్కడ ఉన్నారో తెలిసేది కాదు. ఇప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యల ఫలితంగా వ్యాపారాలు,వ్యక్తిగత పనులను పక్కన పెట్టో లేక సన్నిహితులకు అప్పగించో నియోజకవర్గాల మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టారు.

ఎమ్మెల్యే గారి ఆఫీసుల్లో సందడి సందడి వాతావరణం మొదలయింది. వినతీ పత్రాలు తీసుకోవడం, వాలంటీర్లతో మాట్లాడటం, సచివాలయ ఉద్యోగులకు ఫోన్ లు, గ్రామ స్థాయి, మండల స్థాయి అధికారులతో చర్చలు అయ్యో ఇలా ఒకటా రెండా… సిక్కోలు నుంచి తడ వరకు ప్రతీ ఒక్కరు పరుగులు తీస్తున్నారు. ప్రజా సమస్యల మీద విపక్షం టార్గెట్ చేసే అవకాశం ఇవ్వకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ చేతిలో ఉన్నది చేయడం వరకు చేస్తున్నారు. మంత్రులకు ఫోన్ చేసి… అన్నా పలానా పని ఉంది, ఈ శాఖలో ఇది కావాలని అడుగుతున్నారు.

ప్రశాంత్ కిషోర్ టీం వస్తుంది అనే వార్త కూడా ఎమ్మెల్యేలను ఆలోచనలో పడేసింది. ఏం జరుగుతుందో జగన్ ముందు ఉంటుంది… అందుకే ఏం జరగాలో చూస్తున్నారు. జగన్ ఆశీస్సులతో పదవుల్లోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఆయన మీద గౌరవంతో వచ్చే ఎన్నికల్లో ప్రజా సేవ చేసే అవకాశం కోసం పరుగులు తీస్తున్నారు. కార్యకర్తల మీద కూడా ఫోకస్ పెట్టి వారిని మళ్ళీ యాక్టివ్ చేస్తున్నారు.

ఎన్నికలకు సిద్దం కావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు, జగన్ పని తీరు కూడా కనపడే అంత ఈజీగా ఉండదు.దానికి తోడు రచ్చబండ అనే కార్యక్రమం మొదలయ్యే అవకాశం ఉందనే కామెంట్స్ ఉన్నాయి. వీటి అన్నింటిని తట్టుకోవాలి అంటే ప్రజల్లోకి వెళ్లి పని చేయడమే మేలు అనుకుని… ఉత్సాహంగా నియోజకావర్గాల్లో తిరుగుతున్నారు . టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల ఇంచార్జ్ లు తమ బలాన్ని మరింత పెంచుకోవడానికి ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు. ఇప్పుడు పాజిటివ్ మూడ్ తెచ్చేందుకు తమ కష్టం తాము పడుతున్నారు. త్వరలో సర్వే ఫలితాలు జగన్ టేబుల్ ముందు పాజిటివ్ గా ఉండేలా పరుగులు తీస్తున్నారు.