Idream media
Idream media
సినిమా థియేటర్లని జగన్ ప్రభుత్వం వేధిస్తోందని, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పేరుతో ఇబ్బంది పెడుతోందని ఈ మధ్య చర్చ నడిచింది. కూకట్‌పల్లి శివపార్వతి థియేటర్ దగ్ధం తర్వాత జగన్ ప్రభుత్వ చర్య కరెక్ట్ అని అందరూ ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే మన థియేటర్లలో చాలామటుకు అగ్నిమాపక వ్యవస్థ లేదు. పరికరాలుండవు. వున్న వాటి పనితీరుపై సిబ్బందికి అవగాహన లేదు.
గతంలో ఢిల్లీ ఉపహార్ థియేటర్‌లో అగ్ని ప్రమాదం జరిగి వందల మంది చనిపోయారు. అదే తరహాలో జరిగితే మన దగ్గర కూడా అంతే స్థాయి మరణాలు. కూకట్‌పల్లిలో అర్ధరాత్రి జరిగింది కాబట్టి ఓకే. అదే జనం వున్నపుడు జరిగితే ఘోరం ఎన్ని ప్రాణాలు బలయ్యేవో.
ఇదే ప్రమాదం ఆంధ్రాలో జరిగితే మీడియా మొత్తం జగన్ మీద పడేది. అధికారుల అవినీతి వల్ల థియేటర్‌లో ఫైర్ వ్యవస్థ లేదని, అడిగే నాథుడు లేడని కథనాలు వచ్చేవి. ఈ మధ్య ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో అన్ని థియేటర్లు ఫైర్ ఎన్.ఓ.సీ తెచ్చుకున్నాయి. సర్టిఫికెట్లు లేని వాటిని మూసేశారు.
టికెట్ల మీద చర్చ సంగతి పక్కన పెడితే , టికెట్లు ఎక్కువ రేట్లకి అమ్ముకున్న రోజుల్లో థియేటర్లు సరిగా నిర్వహించారా అనేది ప్రశ్న. టాయిలెట్లు ఎంత కంపు కొడుతుంటాయో అందరికీ తెలుసు. దీనికి లక్షల రూపాయలు ఖర్చు కావు కదా. కేవలం ప్రేక్షకుల మీద గౌరవం లేకపోవడం.
Also Read : జగన్ బాటలో తెలంగాణ సర్కార్.. ఆ నోళ్లన్నీ ఇప్పుడేమంటాయో?